KIM Blue : కిమ్ సైన్యంలో " మ్యాన్ ఇన్ బ్లూ " ఎవరు ? ఇప్పుడిదే అందరికీ ఓ మిస్టరీ !
ఉత్తరకొరియా నియంత ఏం చేసినా.. చేయకపోయినా ప్రపంచానికి ఆసక్తే. ఆయన సైన్యంలో ఓ వ్యక్తి ఫుల్ బ్లూ డ్రెస్‌లో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన వేషాలు, ఘోరాలు మాత్రమే కాదు.. ఉత్తరకొరియా సైన్యం కూడా మిస్టరీనే. ఇటీవలే అమెరికాకు కనిపించకుండా సర్వనాశనం చేసే సైన్యాన్ని తయారు చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. ఆయన ఏం చేస్తున్నారో.. ఏం చేయబోతున్నారో అని అమెరికా నిఘా వర్గాలు టెన్షన్ పడుతూంటే.. కొత్తగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చి వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటోల్లో ఏముందంటే ఓ సైనికుడు స్కిన్ టైట్ బ్లూ డ్రెస్‌లో ఉన్నాడు. అతనికి రంగు రంగుల హెల్మెట్ కూడా ఉంది. అందుకే అతనెవరా అని అందరూ టెన్షన్‌కు గురవుతున్నారు. కిమ్ చెప్పిన ఇన్విజిబుల్ సైన్యంలో సభ్యుడా అన్న చర్చ కూడా ప్రారంభమయింది.
Also Read : ఆకాశం నుంచి దిండుపై ఏదో పడింది? మహిళ ఉలిక్కి పడి లేచింది.. ఆ రాత్రి ఏం జరిగింది?
ఇటీవల కిమ్ జోంగ్ ఉన్న తన సైనిక పాటవ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ ట్రూప్ ఆయన ఎదుట ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత గ్రూప్‌గా ఫోటో దిగింది. ఆ ఫోటోలో అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకున్నారు. అది మిలటరీ డ్రెస్. అయితే సైన్యంలోని ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బ్లూ డ్రెస్‌లో ఉన్నాడు. మామూలుగా అయితే కిమ్ సైన్యంలో క్రమిశిక్షణ ఓ రేంజ్‌లో ఉంటుంది. మిలటరీ డ్రెస్ ఇస్త్రీ చేసుకోలేదనో.. లేకపోతే జాగింగ్‌కు వెళ్లి వచ్చే సరికి లేటయిందని నేరుగా పరేడ్‌కు వచ్చేశాననో చెప్పడానికి చాన్స్ లేదు. అలాంటి కారణాలు చెప్పే చాన్స్ ఇవ్వకుండా శాల్తీని లేపేస్తారు అక్కడి క్రమశిక్షణ అమలు చేసే ఆఫీసర్లు.
Also Read : అరటి చెట్టు మీద పడిందని సుప్రీం కోర్టుకు.. యజమాని ఎన్ని కోట్లు ఇచ్చాడంటే..?
మరి బ్లూ సైనికుడు ఎవరు అనేదే ఇప్పుడు చాలా మందికి వస్తున్న సందేహం. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అదే చర్చనీయాంశం అవుతోంది. కొంత మంది అతన్ని సూపర్ హీరో అంటున్నారు. మరి కొందరేమో కిమ్ రెడీ చేస్తున్న సూపర్ సైన్యంలో సభ్యుడంటున్నారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి కానీ ఎవరో బయటకు తెలిసే అవకాశం లేదు.. స్వయంగా ఉత్తర కొరియా అధికారిక ప్రకటన చేస్తే తప్ప. కానీ ఇలాంటి విషయాలను కిమ్ పట్టించుకోరు. బయటకు చెప్పరు.
Also Read : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు
ఇంకా విశేషం ఏమిటంటే.. కిమ్ ఏం చేస్తాడోనని భయపడే వాళ్లు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఆ బ్లూ డ్రెస్ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. ఎక్కువ మంది .. సూపర్ హీరో కాదని.. కేవలం అతను పారాడ్రైవింగ్ చేసే సైనికుడు అయి ఉంటాడని అంటున్నారు. అదే నిజమైతే చాలా మంది రిలీఫ్ ఫీలవుతున్నారు. లేకుండా ఏ కొత్త సైన్యాన్నో కిమ్ తయారు చేస్తూంటే మాత్రం గండం ప్రారంభమైనట్లే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి