అన్వేషించండి

Revant Vs Nirmala : ఎవరి హిందీ మంచిది ? లోక్ సభలో రేవంత్ వర్సెస్ నిర్మలా సీతారామన్ !

హిందీ భాష విషయంలో లోక్‌సభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ కూడా రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు.

Revant Vs Nirmala :  లోక్‌సభలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య హిందీ భాష విషయంలో వ్యంగ్య వ్యాఖ్యలతో వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రశ్న అడిగిన విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెటకారం చేశారు. ఆయన చాలా వీక్ హిందీలో అడిగారని.. తాను కూడా వీక్ హిందీలో చెబుతానంటూ మాట్లాడటంతో వివాదం ప్రారంభమయింది. ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలేమయిందంటే..

రూపాయి  పతనంపై చర్చలో పాల్గొన్న రేవంత్ 

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి  పతనంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన హిందలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రూపాయి పతనంపై ప్రధానమంత్రి మోదీ.. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పట్లో మోదీ.. రూపాయి ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారని.. మరి ఇప్పుడు రూపాయి ఏ స్థితికి వెళ్లిందని ప్రశ్నించారు. 

రేవంత్ వీక్ హిందీలో మాట్లాడాలని వ్యంగ్యంగా స్పందించిన నిర్మలా సీతారామన్ 

రేవంత్ ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బదులిచ్చారు.   కాంగ్రెస్  ఎంపీ వీక్  హిందీలో అడిగిన ప్రశ్నకు వీక్  హిందీలోనే ఆన్సర్ చెబుతానంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంటే... ఇప్పుడు మాత్రం పరుగులు పెడుతోందని నిర్మల చెప్పారు.  ‘‘కాంగ్రెస్​ సభ్యుడు..  మోడీ అలనాటి వ్యాఖ్యలను ప్రస్తావించే ముందు, నాటి ఆర్థిక సూచీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఐసీయూలోనే ఉంది. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. ఇందుకు గర్వించాల్సింది పోయి అసూయ పడుతున్నారు” అని మండిపడ్డారు. 

తాను శూద్రుడినని తనకు స్వచ్చమైన హిందీ రాదన్న రేవంత్ 

అయితే తన హిందీ భాషపై నిర్మలా సీతారామన్ చేసివ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తన  హిందీ భాషను ఉద్దేశించి నిర్మల చేసిన కామెంట్స్ పై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘‘నేను శూద్రుడిని, నాకు స్వచ్ఛమైన హిందీ రాదు.. నిర్మలగారు బ్రాహ్మణవాది, మంచి హిందీ మాట్లాడుతారు”అని రేవంత్​ వ్యాఖ్యానించారు. కులం, మతానికి సంబంధించిన వ్యాఖ్యలు ఎవరూ సభలో చేయకూడదని స్పీకర్  ఓం బిర్లా తెలిపారు. 

స్పీకర్ తో అభ్యంతరకంగా ప్రవర్తించకూడదన్న ఓం బిర్లా 

స్పీకర్ బిర్లా కూడా రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రశ్న అడుగుతున్న సమయంలో.. జోక్యం చేసుకున్న స్పీకర్.. నేరుగా ప్రశ్న అడగాలని సూచించారు. అయితే  తనకు మధ్యలో అంతరాయం కలిగించొద్దని స్పీకర్​ తో  రేవంత్​ అన్నారు. ఇలా అనడంపై స్పీకర్  అభ్యంతరం చెప్పారు.  స్పీకర్​ పట్ల అలా ప్రవర్తించకూడదని సభ్యులకు చెప్పాలని లోక్​ సభలో ప్రతిపక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరికి స్పీకర్​ సూచించారు.  

ఇరానీ ఛాయ్ అంటే ఇరాన్ లో చేస్తారా?, కేసీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget