అన్వేషించండి

కొవిడ్ తరహా మరో మహమ్మారి ఎప్పుడైనా దాడి చేయొచ్చు, అంతా సిద్ధం కండి - సైంటిస్ట్‌ల హెచ్చరిక

Next Pandemic: మరో మహమ్మారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.

Covid Like Pandemic: కొవిడ్‌ సంక్షోభం సృష్టించిన అలజడిని ప్రపంచం ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతోంది. సాధారణ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో శాస్త్రవేత్తలు వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పారు. మరో మహమ్మారి ప్రపంచంపై ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరించారు. జంతువుల నుంచి మనుషులకి ఈ వైరస్ వ్యాపించే అవకాశముందని వెల్లడించారు. ఈ కారణంగా మరో మహమ్మారిని ఎదుర్కోక తప్పకపోవచ్చని అన్నారు. అయితే...ఈ మహమ్మారి ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పలేమని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి ఇందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. వైరస్‌లపై నిఘా పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పర్యావరణ మార్పులు, భూతాపం పెరగడం, అడవులను ధ్వంసం చేయడం లాంటివి వైరల్, బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు వెల్లడించారు. ఇవే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని వివరించారు. మనంతట మనమే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నామని King’s College Londonకి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో గమనించామని, మరో సంక్షోభం ఎప్పుడైనా ముంచుకు రావచ్చని అన్నారు. 

"మరో మహమ్మారి ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అది రెండేళ్లలో వస్తుందా లేదంటే 20 ఏళ్ల సమయం పడుతుందా అన్నది స్పష్టంగా చెప్పలేం. కానీ కచ్చితంగా మరో సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కోక తప్పదు. అలా అని మనం నీరసపడిపోవాల్సిన పని లేదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి త్యాగాలకైనా మనమంతా సిద్ధంగా ఉండాలి"

- ప్రొఫెసర్ 

మళ్లీ ఎందుకీ సంక్షోభం..?

అమెజాన్ అడవులు ధ్వంసం అవుతున్నాయి. అటు ఆఫ్రికాలోనూ అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఫలితంగా చాలా వరకు జంతువులు, కీటకాలు అడవులకు సమీపంలోని ఇళ్లలోకి వెళ్తున్నాయి. వీటిలో కొన్ని వైరస్‌, బ్యాక్టీరియాని వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో పాటు వాతావరణ మార్పులూ సమస్యని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దోమల ద్వారా డెంగీ, చికున్‌గునియా లాంటి వ్యాధులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ తరహా మహమ్మారులు పుట్టుకొస్తున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Sunil Gavaskar Analysis: టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ పై గవాస్కర్ అనుమానం, అసలు తప్పు ఎక్కడ జరిగిందో  చెప్పిన లెజెండ్!
టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ పై గవాస్కర్ అనుమానం, అసలు తప్పు ఎక్కడ జరిగిందో  చెప్పిన లెజెండ్!
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
ABP Desam Top 10, 30 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 30 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget