By: Ram Manohar | Updated at : 16 Mar 2023 12:37 PM (IST)
న్యూజిలాండ్‌లోని ఓ ద్వీపంలో భూకంపం సంభవించింది. (Image Credits: Pixabay)
New Zealand Earthquake:
7.1 తీవ్రత..
న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకూ ఈ ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 మ్యాగ్నిట్యూడ్ నమోదైంది. ఇప్పటికే అక్కడ సునామీ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ వెల్లడించింది. Kermadec Islands ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే..సునామీ వస్తున్న ఆందోళనల నేపథ్యంలో National Emergency Management Agency స్పందించింది. అలాంటి ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని National Centre for Seismology ట్విటర్ ద్వారా వెల్లడించింది. పసిఫిక్, ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్స్ ప్రాంతంలో ఉండే న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. సెసిమిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ద్వీపంలో ఇప్పటికే చాలా సార్లు భూమి కంపించింది. టర్కీ, సిరియాలోనూ ఇటీవల భారీ భూకంపాలు నమోదయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ ఆ రెండు దేశాలకూ అండగా నిలిచింది.
There is no tsunami threat to New Zealand following the M7.0 earthquake in the Southern Kermadec Islands.
Remember, if an earthquake is long or strong, get gone.
For more info about tsunami preparedness go to https://t.co/Gn7YO8831i— National Emergency Management Agency (@NZcivildefence) March 16, 2023
టర్కీ, సిరియాలోనూ...
ఫిబ్రవరి 6న టర్కీ, పొరుగున ఉన్న సిరియా ఆగ్నేయ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ వరుస భూకంపాలతో 45,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. తాజాగా ఆరుకు పైగా తీవ్రతతో దక్షిణ టర్కీలో భూ ప్రకంపనలు రావడంతో మిగిలిన ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది. టర్కీలో భూకంప బాధితుల మరణాల సంఖ్య మరింత పెరుగుతాయని స్థానికుల్లో భయాందోళన నెలకొంది. భూకంపం సంభవించిన టర్కీ, సిరియాలో 'ఆపరేషన్ దోస్త్'లో పాల్గొన్న భారత సైనికులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశయ్యారు. సహాయ, విపత్తు సహాయక బృందాల పనిని ప్రధాని మోదీ అభినందించారు. భూకంప ధాటికి చెల్లాచెదురైన టర్కీకి పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటోంది. NDRF బృందాలు అక్కడి రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తున్నాయి. దీనిపై టర్కీ పౌరులు సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌కు థాంక్స్ చెప్పారు. భారత్ నుంచి NDRFబృందాలు వచ్చి తమకు ఎంతో సాయం చేస్తున్నాయని, అండగా ఉంటున్నారని ఆనందంగా చెప్పారు.
"ఇప్పుడే ఇండియా నుంచి సహాయక బృందాలు వచ్చాయి. మాకు ఎంతో సాయ చేశాయి. మేం ఒంటరిగా మిగిలిపోతామేమో అని భయపడ్డాం. కానీ వీళ్లు వచ్చాక మాకు దైర్యం వచ్చింది. మీ మద్దతు మేమెప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ."
-టర్కీ పౌరులు
Also Read: అనుమతి ఉన్న ప్రతి చోట మా డ్రోన్లు ఎగురుతాయ్, కాస్త పద్ధతిగా నడుచుకోండి - రష్యాకు అమెరికా వార్నింగ్
UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్- రియాక్ట్ అయిన పోలీసులు
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్
Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు