అన్వేషించండి

NCP reunion: విలీనం కాబోతున్న రెండు ఎన్సీపీలు - ఒకటే పార్టీ - కానీ ఏ కూటమితో ఉంటారు?

NCP: అజిత్ పవార్ చివరి కోరిక మేరకు రెండు ఎన్సీపీలు విలీనం అవుతున్నాయి. కానీ ఒక్క పార్టీగా ఉండే ఎన్సీపీ ఏ కూటమిలో ఉంటుందన్నది ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.

NCP reunion announcement mid February : అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లోని రెండు వర్గాలు మళ్ళీ ఒకటి కాబోతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్సీపీ విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పుణె మున్సిపల్ ఎన్నికల్లో శరద్ పవార్ ,  అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేయడం ఈ దిశగా తొలి అడుగుగా భావించగా, ఇప్పుడు పూర్తిస్థాయి విలీనానికి రంగం సిద్ధమైంది.

ఈ విలీన ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  అజిత్ పవార్  జనవరి 28న బారామతి విమాన ప్రమాదంలో అకాల మరణం చెందడం పార్టీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ పవార్ మరణించినప్పటికీ, ఆయన చివరి కోరిక మేరకు రెండు వర్గాలను కలిపే ప్రక్రియను కొనసాగించాలని ఇరు పక్షాల నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం, విలీనంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ విడుదల కానుంది.            

ఏకీకృత ఎన్సీపీకి నాయకత్వం వహించే విషయంలో ప్రస్తుతం నలుగురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు  శరద్ పవార్ మార్గదర్శకత్వంలో పార్టీ నడవనుండగా, అధ్యక్ష పీఠం రేసులో సుప్రియా సూలే , అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ,  జయంత పాటిల్ ఉన్నారు. ముఖ్యంగా అజిత్ పవార్ పట్ల ఉన్న సానుభూతి పవనాలతో పాటు పార్టీ శ్రేణుల మద్దతు కూడా ఉండటంతో సునేత్రా పవార్ పేరు బలంగా వినిపిస్తోంది.   

ఈ విలీనం జరిగితే మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గం అధికార  మహాయుతి కూటమిలో ఉండగా, శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష  మహా వికాస్ అఘాడీ'లో ఉంది. విలీనం తర్వాత ఈ కొత్త పార్టీ ఏ కూటమితో ముందుకు వెళ్తుంది? లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తుందా? అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాబోయే వారం రోజుల్లో జరిగే ఉన్నత స్థాయి సమావేశాలు ఈ సందిగ్ధతకు తెరదించే అవకాశం ఉంది.   

 

టాప్ హెడ్ లైన్స్

కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget