X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Punjab Congress Update: పట్టువీడిన సిద్ధూ.. అధిష్ఠానం చర్చలు సఫలం.. పీసీసీ చీఫ్ పదవికి ఓకే!

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని నవజోత్ సింగ్ సిద్ధూ తిరిగి చేపడతారని కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ ప్రకటించారు. సిద్ధూతో చేసిన చర్చలు సఫలమైనట్లు ఆయన తెలిపారు.

FOLLOW US: 

పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడినట్లు కనిపిస్తోంది. నవజోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్‌ పదవిలో కొనసాగుతారని పంజాబ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ ప్రకటించారు. 

" కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నవజోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. అధిష్ఠానం నుంచి నాకు వచ్చిన సూచనల ప్రకారం సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలి. పార్టీని వ్యవస్థీకృతంగా నిర్మించాలి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రేపు రానుంది.                                           "
-హరీశ్ రావత్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్

హరీశ్ రావత్ వ్యాఖ్యలపై సిద్ధూ సానుకూలంగా స్పందించారు. 

" పంజాబ్, పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి నా సమస్యలను అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్, పంజాబ్ మంచి కోసమే. వారి ఆదేశాలే నాకు శిరోధార్యం.                                             "
-నవజోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత

పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభంపై చర్చించేందుకు నేడు సిద్ధూ.. ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. సిద్ధూ లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పంజాబ్ ఏఐసీసీ ఇంఛార్జ్ హరీశ్ రావత్ హామీ ఇచ్చారు. కొన్ని అంశాలు పరిష్కారం కావడానికి కొంత సమయం పడుతుందని హరీశ్ ఈ సందర్భంగా అన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సిద్ధూతో భేటీ అనంతరం హరీశ్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సెప్టెంబర్ 28న సిద్ధూ రాజీనామా చేశారు. అయితే దీనిని పార్టీ అంగీరించలేదు. పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలో కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేశారు. అయితే ఎట్టకేలకు సిద్ధూను ఒప్పించి మళ్లీ పదవిని అప్పజెప్పడంలో కాంగ్రెస్ అధిష్ఠానం సఫలమైంది.

Also Read: CBSE Term-1 board exams: 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక ప్రకటన.. పరీక్షలు ఎప్పుడంటే?

Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు

Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'

Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!

Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: navjot singh sidhu punjab congress Punjab Congress Crisis Harish Rawat

సంబంధిత కథనాలు

Aryan Khan-Ananya WhatsApp Chats: ఆర్యన్- అనన్యా మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ లీక్.. ఈ మెసేజ్‌లు చదివారా?

Aryan Khan-Ananya WhatsApp Chats: ఆర్యన్- అనన్యా మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ లీక్.. ఈ మెసేజ్‌లు చదివారా?

Telangana: ఈ పని వెంటనే చేయండి.. లేకుంటే మీకు రేషన్, పెన్షన్ కట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana: ఈ పని వెంటనే చేయండి.. లేకుంటే మీకు రేషన్, పెన్షన్ కట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Revanth Reddy: ఇక కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్... కమీషన్ల కోసమే కాళేశ్వరం... టీఆర్ఎస్ ప్లీనరీపై రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: ఇక కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్... కమీషన్ల కోసమే కాళేశ్వరం... టీఆర్ఎస్ ప్లీనరీపై రేవంత్ హాట్ కామెంట్స్

Cm Jagan Review: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు... పారదర్శకంగా నియామకాలు చేపట్టండి... ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష

Cm Jagan Review: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు... పారదర్శకంగా నియామకాలు చేపట్టండి... ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష

TRS Plenary Updates : ప్లీనరీకి హరీష్ సహా పలువురు సీనియర్లు దూరం ! హుజురాబాద్ బాధ్యతలే కారణం !

TRS Plenary Updates :  ప్లీనరీకి హరీష్ సహా పలువురు సీనియర్లు దూరం ! హుజురాబాద్ బాధ్యతలే కారణం !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్

Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?