News
News
X

Tulasi Reddy: "ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించాలి" - తులసి రెడ్డి

Tulasi Reddy: ఏపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించాలని డాక్టర్ ఎన్. తులసి రెడ్డి డిమాండ్ చేశారు. 

FOLLOW US: 
 
Tulasi Reddy: ఏపీ రాష్ట్ర పర్యటన కోసం ఇక్కడకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని సూచించారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులు విడుదల చేయాలని చెప్పారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలన్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలోనే మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించాలని వ్యాఖ్యానించారు. 

కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రధాని మంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. ఇటీవల కాలలో రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని వివరించారు. నాలుగు రోజుల కిందట అనంతపురం జిల్లా బొమ్మణహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగిపడి 5 మంది రైతు కూలీలు మరణించారన్నారు. నిన్న ఆదివారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ పి కుంటలో విద్యుత్ తీగలు తెగిపడి రెడ్డప్ప రెడ్డి అనే రైతు మరణించారని గుర్తు చేశారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 

మొన్నటికి మొన్న మూడు రాజధానుల అంశంపై కామెంట్లు..

అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని శాసన రాజధాని అనరు, అసెంబ్లీ అని మాత్రమే అంటారని, హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని న్యాయ రాజధాని అనరని, హై కోర్టు అని మాత్రమే అంటారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. పరిపాలన రాజధాని (రాష్ట్ర సచివాలయం)ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారని తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల మాట ఒక నాటకం అని, వికేంద్రీకరణ పాట ఒక బూటకం అంటూ మండిపడ్డారు. విషయం తెలియకుండా ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు 3 రాజధానుల జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

News Reels

పలు రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టులు.. 

హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరని చెప్పారు. కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అస్సాం తదితర 13 రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టు లు ఉన్నాయని, వాటిని రాజధానులు అనడం లేదని చెప్పారు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉందని, కానీ కొచ్చిన్ ను కేరళ రాజధాని అనరని, రాష్ట్ర సచివాలయం ఉన్న త్రివేండ్రం ను మాత్రమే కేరళ రాజధాని అంటారని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాలను గుర్తించాలని తులసి రెడ్డి సూచించారు.

Published at : 07 Nov 2022 05:20 PM (IST) Tags: AP Politics Bjp latest news Narreddy Tulasi Reddy Tulasi Reddy Comments Tulasi Reddy Comments on BJP

సంబంధిత కథనాలు

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!