అన్వేషించండి

Putin Modi Phone Talk: పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ, ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని సూచన

Putin Modi Phone Talk: ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

 Putin Modi Phone Talk:

ప్రధాని సూచనలు..

ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దౌత్యం, సంధి ద్వారానే ఉక్రెయిన్‌తో ఉన్న సమస్యల్ని పరిష్కరించు కోవాలని సూచించారు. "రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని..ప్రధాని మోడీ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సయోధ్య కుదుర్చు కోవాలని సూచించారు" అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. నిజానికి..ప్రధాని మోడీ, పుతిన్ ముఖాముఖి భేటీ కావాల్సి ఉంది. కానీ...అది రద్దైంది.  ఇందుకు కారణం...పుతిన్ పదేపదే అణు హెచ్చరికలు చేయడమే. ఈ విషయంలో భారత్ కాస్త అసహనానికి లోనైందని, అందుకే ప్రధాని మోడీ పుతిన్‌ను నేరుగా కలిసేందుకు సుముఖత చూపలేదని సమాచారం. అయితే...మరికొందరు మాత్రం ఆ మీటింగ్ రద్దు కావడానికి అది కారణం కాదని, అనివార్య కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. గతేడాది పుతిన్‌ ఢిల్లీకి వచ్చారు. భారత్, రష్యా సదస్సులో భాగంగా ఆయన హాజరయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే సదస్సు ఇది. ఈ ఏడాది ఎస్‌సీఓ సమ్మిట్‌లో ప్రధాని మోడీ, పుతిన్ నేరుగా కలిశారు. ఆ సమయంలోనే మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది యుద్ధం చేసుకోవాల్సి రోజులు కావు. 
ఏదైనా కలిసి కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది" అని సూచించారు. 

మోడీకి అంతర్జాతీయ మద్దతు..

మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ మద్దతు పెరుగుతోంది. ఆ మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మోడీని సపోర్ట్ చేయగా..ఇప్పుడు అమెరికాకు చెందిన సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ జనెట్ యెల్లెన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఇది యుద్ధాలు చేసుకోవాల్సిన కాలం కాదని భారత ప్రధాని మోడీ చెప్పిన మాటలు అక్షరాలా సత్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు" అని అన్నారు యెల్లెన్. "లక్షలాది మంది పేదరికంలో కూరుకుపోతున్నారు. ఇలాంటి కష్టకాలాలు మనకు పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి సవాళ్లు ఎదురైన ప్రతిసారి భారత్, అమెరికా మధ్య మైత్రి ఇంకా బలపడుతోంది" అని వెల్లడించారు. అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించేందుకు భారత్‌కు వచ్చారు యెల్లెన్. ఈ సందర్భంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నోయిడాలోని Microsoft India Development Centre బిజినెస్ లీడర్స్‌ను కలిశారు. "ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. కాలానికి అనుగుణంగా భారత్, అమెరికా మధ్య మైత్రి బలపడుతోంది. సప్లై చెయిన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సమష్టిగా పని చేయాల్సిన అవసరముంది" అని జనెట్ యెల్లెన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పీఎం మోదీని ప్రశంసించారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన సమయం కాదని భారత ప్రధాని మోదీ చెప్పిన విషయం అక్షరాలా నిజం" అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వెల్లడించారు. న్యూయార్క్‌లో జరిగిన 77వ సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మేక్రాన్. "పీఎం మోదీ చెప్పింది నిజం. పశ్చిమ దేశాలపై ఈ యుద్ధం ద్వారా పగ తీర్చుకోవాలనుకోవడం సరికాదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాల్సిన సమయమిది. అందరం కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి" అని అన్నారు. 

Also Read: Viral News: రెండేళ్ల బాలుడ్ని మింగేసిన హిపోపాటమస్- కానీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget