అన్వేషించండి

Nara Lokesh: మంగళగిరిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా, మీ బిడ్డగా ఆశీర్వదించండి - లోకేశ్

Mangalagiri News: మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయాలకు సంబంధం లేని వివిధరంగాల ప్రముఖులను గత 3 రోజులుగా యువనేత లోకేష్ కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

Lokesh Comments in Mangalagiri: మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, మీ ఇంటి బిడ్డలా భావించి రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ మంగళగిరి ప్రముఖులను అభ్యర్థించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రాజకీయాలకు సంబంధం లేని వివిధరంగాల ప్రముఖులను గత 3 రోజులుగా యువనేత లోకేష్ కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మూడో రోజైన శుక్రవారం (డిసెంబర్ 29) మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థోడెంటిస్ట్ మాజేటి వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కక్కోలు సత్యనారాయణరావు, ప్రముఖ చేనేత వస్త్రవ్యాపారి తుమ్మా సత్యనారాయణలను కలిశారు. తొలుత మంగళగిరి కొత్తపేటలోని మాజేటి వంశీకృష్ణ నివాసానికి వెళ్లిన లోకేష్ కు సాదర స్వాగతం పలికారు. 

వంశీకృష్ణ రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ నెలకొల్పి సేవలందిస్తుండగా, వారి కుటుంబసభ్యులు దశాబ్ధాలుగా మంగళగిరిలో ఆయిల్ మిల్స్, హోటల్స్, పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నారు. హాస్పటల్స్, వ్యాపారాల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న లోకేష్... 3 నెలల్లో రాబోయే ప్రజా ప్రభుత్వం స్వేచ్చాయుత వాతావరణంగా వ్యాపార  కార్యకలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వివిధరకాల వ్యాపారాల ద్వారా పదిమందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉందని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యుడు కక్కోలు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

గత 40 ఏళ్లుగా మంగళగిరిలో నివాసముంటున్న సత్యనారాయణ కుటుంబం పట్టణంలో భవానీ నర్సింగ్ హోమ్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్థికస్థోమత లేని పేదలకు ఉచితంగా వైద్యసేవలతోపాటు మందులు  అందించడం అభినందనీయమని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సత్యనారాయణ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చివరగా మంగళగిరి 25వవార్డుకు చెందిన టివిఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత తుమ్మా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులను నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

మంగళగరి పట్టణంలో చేనేతలు, మాస్టర్ వీవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కార మార్గాలను లోకేష్ తెలుసుకున్నారు. మంగళగిరిలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు యువనేత  సందర్భంగా తెలిపారు. ఓడినా నాలుగున్నరేళ్లుగా తాను మంగళగిరిలోనే ఉంటూ వివిధ వర్గాల ప్రజలకు తమవంతు సేవలందిస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి, నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి సహకరించాల్సిందిగా లోకేష్ కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Viral News: స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
Embed widget