అన్వేషించండి

Nara Lokesh: ఓడితే ఎగతాళి చేశారు, అదే నాలో కసి పెంచింది - నారా లోకేశ్

Mangalagiri Politics: మంగళగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు.

Nara Lokesh Comments: లోకేష్ ఏమిటో మంగళగిరి ప్రజలు తెలుసుకోలేకపోయారని.. తాను ఓడినా కానీ ఆ నియోజకవర్గాన్ని వీడలేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు. యువగళం యాత్రలో అనేక సమస్యలు విన్నపుడు తనకు మంగళగిరి గుర్తు వచ్చేదని, వారు చెప్పే సమస్యలన్నీ మంగళగిరిలోనే తెలుసుకున్నానని అన్నారు. 

‘‘అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీర్చాం, పెళ్లి కానుకలు అందజేసాం, స్వయం ఉపాధి కోసం తోపుడు బల్లు అందించాం, స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మెషిన్లు అందించాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఉచితంగా వైద్యం, మందులు ఇస్తున్నాం, యువ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ అందిస్తున్నాం, జలధార పేరుతో ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నాం, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసాం, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల కోసం ట్రై సైకిల్స్ ఇచ్చాం, రజక సోదరులకు ఇస్త్రీ బల్లు అందించాం, స్వర్ణకారులకు లక్ష్మినరసింహ స్వర్ణకార సహకార సంఘం ఏర్పాటు చేసాం, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్ లకు పండుగ కానుకలు ఇస్తున్నాం, రోడ్లు రిపేర్ చేసాం, కొన్ని రోడ్లు వేసాం, నాయి బ్రాహ్మణులకు సెలూన్ చైర్స్ అందించాం, కార్మికుల కోసం వెల్డింగ్ మెషిన్స్ అందించాం, కోవిడ్ సమయంలో వైద్య సహాయం అందించాం, టిడిపి కార్యకర్తలకు ఆర్ధిక సాయం అందించాం, ఆర్ఎంపి  డాక్టర్లకు వైద్య పరికరాలు అందించాం, వేసవిలో చలి వేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసాం, దళిత బిడ్డల పెళ్లి కి తాళిబొట్లు అందిస్తున్నాం, చేనేత కార్మికులకు రాట్నాలు అందించాం.

ఓడినపుడు చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మళ్లీ మంగళగిరి నుంచే పోటీచేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, తగ్గేదే లేదని చెప్పాను. ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం మంగళగిరికి చేసింది గుండుసున్నా. రెండుసార్లు వైసిపిని గెలిపించారు, మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలి? ఇప్పుడు ఎమ్మెల్యేనే మారిపోయే పరిస్థితి వచ్చింది? ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశాక మీడియా మిత్రులతో మాట్లాడుతూ మా సీఎం మంగళగిరి ప్రజలను మోసం చేశారన్నారు. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాటతప్పి, మడమతిప్పారు, ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి నయాపైసా కేటాయించలేదు. ఆర్కే జగన్ పని అయిపోయిందని చెప్పారు, వైసిపి ప్రభుత్వం మంగళగిరి ప్రజలను మోసం చేసింది.

మంగళగిరిని నా కడుపులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఓడిపోయినా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డా. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించా. టిడిపి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం. నియోజకవర్గంలో ఎసైన్డ్, ప్రభుత్వం, ఇరిగేషన్, ఎండోమెంట్ భూముల్లో దశాబ్ధాలుగా ఎంతోమంది పేదలు నివసిస్తున్నారు, టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో వారి స్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం. టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. తాడేపల్లిలో రైతులకు అత్యంత ఇబ్బందికరంగా తయారైన యూ 1 జోన్ ఎత్తేసి ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం. నియోజకవర్గంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఫ్లైఓవర్, అండర్ పాస్ లు ఏర్పాటుచేస్తాం.

ఉపకులాల వారీగా అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, స్మశానాలకు స్థలాలు కేటాయిస్తాం. రైతాంగానికి అండగా నిలబడతాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేసే బాధ్యత నాది. ఇక మనముందు ఉన్నది కేవలం వందరోజులు మాత్రమే. నియోజకవర్గంలోని పెద్దల వద్దకువెళ్లి కలుస్తున్నాను. సమయాన్ని బట్టి అందరినీ కలుస్తా. నాయకులకు ప్రోటోకాల్, ఈగోలు వద్దు, అందరం కలిసి పనిచేద్దాం. ఓటర్ వెరిఫికేషన్ పై కేడర్ అంతా దృష్టిసారించాలి, ఇందుకోసం క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ ఏర్పాటుచేశాం. ప్రతిగడపకు వెళ్లి మన హామీలను ప్రజల్లోకి వెళ్లాలి, ఇప్పటికి 52వేల ఇళ్ల వద్దకు వెళ్లారు, జనవరికల్లా అన్ని ఇళ్లకు వెళ్లాలి.

బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన నియోజకవర్గంలో ఇళ్లు లేని వారు, రెగ్యులరైజ్ చేయాల్సిన వివరాలు సేకరించాలి. ప్రతి గడపకూ వెళ్లాలి. కార్యకర్తలు, నాయకులు గ్రూప్ రాజకీయాల జోలికి వెళ్లవద్దు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో ఎవరు పనితీరు కనబరుస్తారో వారినే నేను గౌరవిస్తాను. వారానికి 5రోజులు ఓపిగ్గా ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోండి. 45 రోజుల్లో పూర్తిచేయవచ్చు. ప్రచార ఆర్భాటం వద్దు. బూత్ లలో ఉన్న కమిటీ సభ్యులు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపా వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి మనం అమలుచేసే పథకాలు తెలియజేయండి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీలనుంచి పలువురు వచ్చినా ఇప్పుడున్న కేడర్ ను కాపాడే బాధ్యత నాది. మనవారిని ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోను. పార్టీకోసం ఎవరు ఎంతకష్టపడ్డారో నాకు తెలుసు, మీ బాధ్యత నాది. ఈ ప్రభుత్వంలో అందరూ పోలీసులతో సహా బాధితులే. నాయకులంతా అందరూ ప్రజల్లో ఉండి, ప్రజలతో మమేకమై మంగళగిరిలో భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలి. వచ్చే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే బాబుతో పోరాడితే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా. వచ్చే వందరోజులు పార్టీకోసం కేడర్ అంతా అహర్నిశలు కృషిచేయండి. ఇప్పటి వైసిపి ఇన్ చార్జి గురించి మాట్లాడాల్సిన పనిలేదు, ఎవరేమిటో ప్రజలకు తెలుసు’’ అని నారా లోకేశ్ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget