అన్వేషించండి

Nandyal News: పోలీసులకు పరిధి పంచాయితీ- కన్నవారిది కడుపుకోత- రెండురోజులుగా ఏట్లో మృతదేహం!

Nandyal News: కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోతిరెడ్డిపాడు వద్ద ఓ మృతదేహం ఉంది చూసి రమ్మని చెప్పారు. కెనాల్ లో బోర్లాపడి ఉన్న మృతదేహాన్ని చూస్తూ కన్నవాళ్ల కంటనీరు పెడుతున్నారు. 

Nandyal News: కళాశాలకు అని వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదు. తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేశారు. బంధువుల్లో కూడా ఆరా తీశారు. అయినా ఎలాంటి చప్పుడూ లేకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓ కాలువలో ఓ మృతదేహం లభించింది. అది కూడా ఓ అబ్బాయిది. మీరోసారి వెళ్లి చూడండి.. మీ వాడిదేనోమో అని పోలీసులు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లారా తల్లిదండ్రులు. కానీ ఆ మృతదేహం బోర్లా ఉండడంతో ఆ తల్లిదండ్రులు అది తమ కుమారుడి శవమేనా కాదా అనే అనుమానం వస్తోంది. కుమారుడు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నీలం రంగు చొక్కానే వేస్కోవడం, మృతదేహంపై కూడా అదే రంగు చొక్కా ఉండడంతో.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని బయటకు తీయాల్సిన పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటే.. తమ పరిధిలోకి రాదని చెప్తూ.. రెండ్రోజుల నుంచి మృతదేహాన్ని అలాగే వదిలేశారు. పోలీసులు వస్తే తప్ప మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం లేక కాలువ గట్టుపై కూర్చొనే తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

ఈనెల 21వ తేదీ నుంచి యువకుడి అదృశ్యం..

కర్నూలుకు చెందిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి ఒకరు ఈనెల 21వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు రెండ్రోజుల పాటు వెతికారు. స్నేహితులు, బంధువుల అందరికి ఫోన్లు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో ఈనెల 23వ తేదీన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని.. ఓసారి చూసి రండంటూ పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మూడో గేటు వద్ద నీటిపై తేలిన ఈ యువకుడి మృతదేహంపై నీలి రంగు చొక్కా ఉంది. అప్పటికే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమీపంలోని పాములపాడు స్టేషన్ సిబ్బంది వచ్చి చూసి ఇది జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లొచ్చి పాములపాడు ఠాణాకే చెందుతుందని చెప్పారు. ఇలా ఒకరిపై ఒకరు వంతులేసుకొని మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

మృతదేహం కుళ్లిపోక ముందే వెలికి తీయాలి..

మృతదేహాన్ని వెలికి తీయించి ఉంటే ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు తెరరపడేది. కుమారుడు కనిపించ లేదని కొంత.. చనిపోయాడో ఏమో అనే బెంగతో మరికొంత వారు ఏటి గట్టు మీదే కూర్చొని కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని మృతదేహం పూర్తిగా కుళ్లిపోక ముందే బయటకు తీయాలని స్థానికులు కోరుతున్నారు. అయినా ప్రజలకు సాయంగా నిలవాల్సిన పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని వెళ్లిపోవడం సరైన పద్దతి కాదని అంటున్నారు. ఎవరిదైనా సరే ముందు మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేయాలని చెబుతున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తేనే.. ప్రజలకు వారి పట్ల నమ్మకం ఉంటుందని వివరిస్తున్నారు. మరి చూడాలి.. పోలీసులు ఇప్పటికైనా స్పందించి మృతదేహాన్ని బయటకు తీస్తారో, లేదో. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget