Landslide in Nagaland: నాగాలాండ్‌లో కొండచరియలు విరిగిపడి నుజ్జునుజ్జయిన కార్లు - ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Landslide in Nagaland: నాగాలాండ్ లో మంగళవారం రోజు సాయంత్రం 5 గంలకు కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు కాగా.. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Landslide in Nagaland: జులై నాలుగువ తేదీ మంగళవారం రోజు సాయంత్రం నాగాలాండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద బండరాళ్లు కొండపై నుంచి దొర్లుతూ వచ్చి రోడ్డుపై వెళ్తున్న కార్లపై పడ్డాయి. దీంతో రెండు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దిమాపూర్, కోహిమా మధ్య చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి - 29పై వాహనాలు భారీగా బార్లు తీరి ఉన్నాయి. ఇంతలో పెద్దపెద్ద బండరాళ్లు మెరుపు వేగంతో రోడ్డుపైకి దూసుకొచ్చాయి. అంతే రోడ్డుపై ఉన్న రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కార్ల పార్టులు, డెడ్‌బాడీలు రోడ్డుపై పడ్డాయి. ఇది చూసిన మిగతా వాహనదారులు షాక్ తిన్నారు.
అయితే భారీ వర్షాల కారణంగా సాయంత్రం 5 గంటల కొండ చరియలు విరిగి పడి.. రెండు పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై ఉన్న కార్లమీదకు వచ్చి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#WATCH | A massive rock smashed a car leaving two people dead and three seriously injured in Dimapur's Chumoukedima, Nagaland, earlier today
— ANI (@ANI) July 4, 2023
(Viral video confirmed by police) pic.twitter.com/0rVUYZLZFN
వర్షం కారణంగా కార్లన్నీ ఒకదాని వెనుక ఒకటి నిలిచి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కొండ పైనుంచి బండరాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో రెండు కార్లు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అయితే ఈ కార్ల వెనకాలే ఉన్న ఓ కారులోని వ్యక్తి సెల్ ఫోన్ లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లియర్ గా రికార్డు అయ్యాయి. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడిచింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గాయపడగా.. కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నించిన్లు తెలుస్తోంది.
Today, rockfall on the National Highway at around 5pm between Dimapur & Kohima caused serious damage including death to 2 persons & serious injury to 3 others. This place has always been known as “pakala pahar”; known for landslides & rockfalls. @nitin_gadkari @AmitShah @PMOIndia
— Neiphiu Rio (@Neiphiu_Rio) July 4, 2023
ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని "పాకలా పహార్" అని పిలుస్తారని.. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, బండరాళ్లు వచ్చి రహదారిపై పడడం సర్వసాధారణంగా జరుగుతుంటుందని అంటున్నారు.
The State Govt. is taking all necessary steps to provide emergency services, grant of ex-gratia for the deceased of Rs 4 lakh each and the necessary medical assistance and help to the injured.
— Neiphiu Rio (@Neiphiu_Rio) July 4, 2023
I convey my deepest condolences to the families of the deceased and pray for speedy recovery of those injured.
— Neiphiu Rio (@Neiphiu_Rio) July 4, 2023
With the advancement of technology in India and the resources available to the GoI, there should be no compromise in ensuring safety of our citizens.
— Neiphiu Rio (@Neiphiu_Rio) July 4, 2023