NEET Row: ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి, నీట్ పేపర్ లీక్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లీక్ ఎలా జరిగిందో గుర్తించాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది.
NEET Row: నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ రీటెస్ట్‌పై చాలా జాగ్రత్తగా ఉండాలని తేల్చి చెప్పింది. 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మందలించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాదాపు 30 పిటిషన్‌లు దాఖలయ్యాయి. పేపర్ లీక్ జరిగిందన్న విషయాన్ని ముందు అంగీకరించాలని తేల్చి చెప్పింది. ఓ ఇద్దరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్ చేసినంత మాత్రాన ఎగ్జామ్‌ని రద్దు చేస్తే ఎలా అని ప్రశ్నించింది. పేపర్ ఎలా లీక్ అయిందన్న విషయాన్ని గుర్తించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రీటెస్ట్‌కి ఆదేశాలు జారీ చేసే ముందు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. అసలు ఎలా లీక్ జరిగిందన్న దానిపైనే దృష్టి పెట్టాలని సూచించింది. రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమేనని అభిప్రాయపడింది. కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వివరాలు అందించాలని స్పష్టం చేసింది.
"ఈ పేపర్ లీక్ కారణంగా అకాడమిక్‌పైనా ప్రభావం పడుతుంది. అందుకే పేపర్ ఎలా లీక్ అయిందనే దానిపై దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకూ ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏం చర్యలు తీసుకుందో చెప్పండి. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎన్ని FIRలు నమోదయ్యాయి? సోషల్ మీడియా ద్వారా లీక్ జరిగి ఉంటే ఆ ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉంటుందన్నది గమనించాలి. ఎన్ని ఫలితాలను హోల్డ్‌లో పెట్టాలో కూడా చెప్పండి. ఈ పేపర్ లీక్ కారణంగా ఎంత మంది లబ్ధి పొందారో ఎలా తేలుస్తారో వివరించండి
- సుప్రీంకోర్టు
NEET-UG exam: Supreme Court observes that it is an admitted fact that there is a leak and the nature of leak is something that we are determining. You don't cancel a whole exam only because 2 students engaged in malpractice. Therefore, we must be careful about the nature of leak.…
— ANI (@ANI) July 8, 2024
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా మొత్తం 38 పిటిషన్‌లపై విచారణ చేపడుతున్నారు. MBB,BDSతో పాటు మరికొన్ని మెడికల్ కోర్స్‌లలో అడ్మిషన్ రావాలంటే కచ్చితంగా నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అయితే..ఈ ఎగ్జామ్‌ని కండక్ట్ చేయడంలో చాలా అవకతవకలు జరిగాయని పిటిషనర్‌లు ఆరోపించారు.
Supreme Court asks how many students' results have been withheld owing to leakage which took place; asks, where are these students - as in their geographical distribution? Are we still finding out the wrongdoers and have we been able to identify the beneficiaries?, asks Supreme…
— ANI (@ANI) July 8, 2024
Also Read: Bosses On Sale: మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్