![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cruise Ship Case: డ్రగ్స్ కేసులో కొత్త అప్‌డేట్.. షారుక్ కుమారుడికి కస్టడీ పొడిగింపు
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఈ నెల 7వరకు కస్టడీ విధించింది ముంబయి సిటీ కోర్టు.
![Cruise Ship Case: డ్రగ్స్ కేసులో కొత్త అప్‌డేట్.. షారుక్ కుమారుడికి కస్టడీ పొడిగింపు Mumbai's Esplanade Court sends Aryan Khan, Arbaz Seth Merchant and Munmun Dhamecha to NCB custody till 7th October Cruise Ship Case: డ్రగ్స్ కేసులో కొత్త అప్‌డేట్.. షారుక్ కుమారుడికి కస్టడీ పొడిగింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/04/556fac7602ae9798ba2677ed04014e59_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నిన్న అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు ముగ్గురు నిందితులకు ఈ నెల 7వరకు ఎన్‌సీబీ కస్టడీకి ముంబయి సిటీ కోర్టు అనుమతించింది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
క్రూజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ సోమవారం మధ్యాహ్నం సిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆర్యన్ ఖాన్‌తో పాటు నిందితులను ఈ నెల 11వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌సీబీ కోరింది. ఈ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
వాడివేడి వాదనలు..
ఎన్‌సీబీ తరఫున కోర్టులో ఏఎస్‌జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ తరఫున సతీశ్ మనేశిందే వాదించారు. వీరిద్దరి మధ్య వాదనలు వాడీవేడిగా సాగాయి.
అధికారులు జరిపిన సోదాల్లో ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని సతీశ్ వాదించారు.
విచారణలో..
తాను నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్.. ఎన్‌సీబీకి తెలిపినట్లు సమాచారం. అతను యూకే, దుబాయ్, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
అయితే అంతకుముందు షారుక్ ఖాన్ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం.
Also Read:Aryan Khan Drug Case: అవును.. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఖాన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)