By: ABP Desam | Updated at : 13 Aug 2021 04:59 PM (IST)
కరోనా నిర్ధరణ పరీక్షలు( ఫైల్ ఫోటో)
మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరంగా మారుతోంది. ముంబయికి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు డెల్టా ప్లస్ వేరియంట్ తో మృతి చెందింది. ఆమె రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్‌తో మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ముంబయిలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణంగా అధికారులు నిర్ధారించారు. జులై 21న వృద్ధురాలికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే రోజు ఆమె ఆసుపత్రిలో చేరారని, పొడి దగ్గు, ఒళ్లునొప్పులు, రుచి కోల్పోవడం మొదలైన లక్షణాలు ఆమె కనిపించాయని వైద్యులు పేర్కొన్నారు.
వృద్ధురాలు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఐసీయూలో అందించామని వైద్యులు తెలిపారు. వైద్యం అందజేసినప్పటికీ ఆమె జులై 27న చనిపోయినట్టు స్పష్టం చేశారు. ఆ వృద్ధురాలికి డెల్టా ప్లస్ వేరియంట్(ఏవై.1) సోకినట్లు ఆగస్టు 11న బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ అధికార ప్రకటనలో తెలిపింది. ముంబయిలో చనిపోయిన మహిళతో సహా పూర్తిస్థాయి టీకా తీసుకున్న మరో ఏడుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ నిర్ధారణ అయ్యిందని ప్రకటించింది. వీరితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించేపనిలో ఉన్నారు అధికారులు. చనిపోయిన మహిళతో కాంటాక్ట్ అయిన ఇద్దరికి డెల్టా ప్లస్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
మహారాష్ట్రలో రెండో మరణం
వృద్ధురాలి ప్రయాణాలపై ఆరా తీసిన అధికారులు ఆమె ఎటువంటి ప్రయాణాలు చేయలేదని చెప్పారు. కరోనా చికిత్స సమయంలో ఆక్సిజన్, స్టెరాయిడ్స్, రెమ్‌డెసివిర్‌ను కూడా అందించామని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇది డెల్టా ప్లస్ రెండో మరణంగా గుర్తించారు. రత్నగిరిలో 80 ఏళ్ల వృద్ధుడు గత నెలలో డెల్టా ప్లస్ వేరియంట్ తో మృతి చెందాడు. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య 65కు చేరింది. బుధవారం ఒక్క రోజే 17 మందికి ఈ వేరియంట్ సోకినట్టు తెలుస్తోంది. ముంబయిలో ఏడు, నాందేడ్, గొండియా, రాయ్‌గఢ్, పాల్ఘర్‌లో రెండేసి, చంద్రపూర్, అకోలాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. డెల్టా ప్లస్ కేసుల్లో 7గురు చిన్నారులు, ఎనిమిది మంది వృద్ధులు ఉన్నారు. వీరిని ప్రైమరీ కాంటాక్టులను అధికారులు గుర్తిస్తున్నారు. అయితే దేశంలో ఇప్పటి వరకూ 86 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దీని వ్యాప్తి అంత వేగంగా లేదని కేంద్రం ప్రకటించింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదుకాగా తర్వాత మధ్యప్రదేశ్, తమిళనాడులో ఉన్నాయని కేంద్రం తెలిపింది.
Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు