Viral News: వైరల్ చేసి ఆటోడ్రైవర్ ఉపాధిని నాశనం చేసిన నెటిజన్లు - ఆ ముంబై ఆటోడ్రైవర్ ఏడ్చేస్తున్నారు !
Mumbai: ఆ ఆటోడ్రైవర్ వినూత్న ఐడియాతో లక్షలు సంపాదించేస్తున్నాడని వైరల్ చేశారు. ఇప్పుడు అతని ఉపాధి పోయింది.

Viral Auto Driver : సోషల్ మీడియా మంచి చేస్తుందో.. చెడు చేస్తుందో చెప్పడం కష్టం. ఈ విషయం ముంబై ఆటోడ్రైవర్ విషయంలో మరోసారి నిజం అయింది. లక్షలు సంపాదించేస్తున్నారని ఓ ఆటోడ్రైవర్ ను వైరల్ చేశారు. ఇలా చేయడం వల్ల అతని ఉపాధి కోల్పోయి రోడ్డున పడినట్లు అయింది.
ముంబైలోని యు.ఎస్. కాన్సులేట్ సమీపంలో బ్యాగ్ స్టోరేజ్ సేవలు అందించి నెలకు 5 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఒక ఆటో డ్రైవర్ కథ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న యు.ఎస్. కాన్సులేట్ వద్ద వీసా దరఖాస్తుదారులు తమ బ్యాగులను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. సమీపంలో అధికారిక లాకర్ సౌకర్యం లేదు. దీంతో ఈ ఆటో డ్రైవర్ ఈ సమస్యను గుర్తించి, బ్యాగ్ స్టోరేజ్ సేవ ను ప్రారంభించాడు. ఒక్కో కస్టమర్‌కు 1,000 రూపాయల ఛార్జీ వసూలు చేసేవాడు.
రోజుకు 20-30 మంది కస్టమర్లకు సేవలు అందించి, రోజుకు 20,000 నుండి 30,000 రూపాయలు సంపాదించేవాడు, ఇది నెలకు 5-8 లక్షల రూపాయల ఆదాయంగా మారింది. ఈ ఆదాయం అనేక ఉన్నత స్థాయి కార్పొరేట్ ప్రొఫెషనల్స్ జీతాలకన్నా ఎక్కువ. ఈ ఆటో డ్రైవర్ స్థానిక పోలీసు అధికారితో ఒప్పందం చేసుకుని సమీపంలోని సురక్షిత లాకర్ సౌకర్యంలో బ్యాగులను నిల్వ చేసేవాడు. ఆటో రిక్షా కేవలం ఆ బ్యాగుల సేకరణ ఆఫీసులాగా వాడుకునేవాడు.
#Mumbai
— मुंबई Matters™👁️🗨️ (@mumbaimatterz) June 11, 2025
What Super Fast Action...
Wish #MumbaiPolice shows the same Alacrity to take ACTION on all other matters, like Auto Drivers refusing Fares, Overcharging, Wrong side driving, etc.https://t.co/XmyhZE9uNL pic.twitter.com/pKKrZRute8
సోషల్ మీడియాలో రాహుల్ రూపానీ అనే వ్యక్తి ఈ ఆటో డ్రైవర్ కథను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నాడు. అతను ఈ వ్యాపారాన్ని "స్ట్రీట్-స్మార్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్"గా ప్రశంసించాడు. బిలియనీర్ హర్ష్ గోయెంకా ను "ప్యూర్ ఇండియన్ జుగాద్" అని పిలిచారు. ఈ డ్రైవర్ సృజనాత్మకతను అభినందించాడు. ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీ కూడా ఈ వ్యాపారం వెంచర్ క్యాపిటల్ సామర్థ్యంపై చర్చించారు.
ఈ వైరల్ పోస్ట్ ముంబై పోలీసుల దృష్టిలో పడింది. యు.ఎస్. కాన్సులేట్ అధిక భద్రతా ప్రాంతం కావడంతో, అనధికార వాణిజ్య కార్యకలాపాలు, ముఖ్యంగా తనిఖీ చేయని వస్తువుల నిల్వ, భద్రతా ముప్పుగా పరిగణించారు. BKC పోలీసు స్టేషన్ నుండి సీనియర్ అధికారి ఈ ఆటో డ్రైవర్‌తో పాటు ఇలాంటి సేవలు అందిస్తున్న మరో డజను మందిని సమన్లు జారీ చేసి పిలిపించారు. ఈ సేవలకు ఎలాంటి అధికారిక అనుమతి లేనందున, వెంటనే ఈ వ్యాపారాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి సేవలు ప్రారంభించకుండా కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Remember the auto driver who went viral for earning ₹5-8 lakh per month?
— Marketing Maverick (@MarketingMvrick) June 11, 2025
Well, Mumbai Police has now shut down his ‘locker service’.
. pic.twitter.com/HraeDzHmNr
దీంతో ఈ ఆటో డ్రైవర్ వ్యాపారం ఆగిపోయింది. ఆదాయం కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆటోడ్రైవర్ కు ఏడుపొక్కటే తక్కువ. వైరల్ కాకపోతే ఆయన వ్యాపారం అలా కొనసాగేది.





















