Mumbai civic body poll: ఉద్ధవ్ సేనకు బూస్ట్ ఇచ్చే న్యూస్- ముంబయి వచ్చేందుకు తేజస్వీ సై!
Mumbai civic body poll: ముంబయిలో ఉద్ధవ్ ఠాక్రే సేనకు మద్దతుగా నిలిచేందుకు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముందుకు వచ్చారు.
![Mumbai civic body poll: ఉద్ధవ్ సేనకు బూస్ట్ ఇచ్చే న్యూస్- ముంబయి వచ్చేందుకు తేజస్వీ సై! Mumbai civic body poll: Bihar deputy CM Tejashwi Yadav likely to campaign for Uddhav Sena Mumbai civic body poll: ఉద్ధవ్ సేనకు బూస్ట్ ఇచ్చే న్యూస్- ముంబయి వచ్చేందుకు తేజస్వీ సై!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/24/8fc8fa8aa1baf6f0b9ca7b75c4bb13d41669290200450218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mumbai civic body poll: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతుగా నిలుస్తున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం తరఫున తేజస్వి యాదవ్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. శివసేన నేత ఆదిత్య ఠాక్రే బుధవారం పట్నాలో తేజస్వి యాదవ్‌తో భేటీ అయ్యారు.
అంతేకాదు
బీఎంసీ ఎన్నికల్లో ప్రచార ప్రణాళికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను విపక్షాలు దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపైనా ఇద్దరు యువనేతలు చర్చించినట్లు తెలుస్తోంది. భాజపాను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని తేజస్వీ, ఆదిత్య అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
శివసేనలో ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో చీలిక వచ్చింది. ఈ క్రమంలో బీఎంసీ ఎన్నికల్లో పాలక సేన అధికారాన్ని నిలుపుకోవడం సవాల్‌గా మారింది. బీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ముంబయిలో నివసిస్తున్న 50 లక్షల మంది యూపీ, బిహార్ ప్రజల ఓట్లు కీలకంగా మారాయి. వీరి ఓట్లను ఆకర్షించేందుకు తేజస్వి యాదవ్‌ను బీఎంసీ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఠాక్రే ఆహ్వానించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)