Air Inida crash victim survive: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణం నిలుపుకున్న మరో శిశువు - 8 నెలల బిడ్డను కాపాడుకున్న తల్లి
Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఎనిమిది నెలల శిశువు మృత్యుంజయురాలైంది. ఆమె తల్లి కాపాడుకున్నారు.

Ahmedabad Air India crash victim survives: జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఎనిమిది నెలల ధ్యాన్ష్ ప్రాణాలతో బయటపడిన అతి పిన్న వయస్కుడుగా రికార్డు సృష్టించాడు. ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే బయట పడ్డారు. కానీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడినప్పుడు గాయపడిన వారిలో ఎనిమిది నెలల ధ్యాన్ష్ కూడా ఉన్నాడు. హాస్టల్ లో ఉన్న వారిలో 19 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.
జూన్ 12, 2025న, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్‌కు టేకాఫ్ అయిన 30 సెకన్లలో బీజే మెడికల్ కాలేజీ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌పై కుప్పకూలింది. విమానం రన్‌వే నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న రెసిడెన్షియల్ భవనంలో కూలిపోయి, భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది, దీనిలో 260 మంది మరణించారు.
ధ్యాన్ష్ తండ్రి, కపిల్ కచ్చాడియా, బీజే మెడికల్ కాలేజీలో యూరాలజీలో MCh విద్యార్థి. అతని కోసం భార్య బిడ్డలు హాస్టల్ లో ఎదురు చూస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలినప్పుడు తన శరీరంతో ధ్యాన్ తల్లి ఎనిమిది నెలల శిశువును అగ్ని జ్వాలల నుండి కాపాడింది. దట్టమైన పొగ , తీవ్రమైన వేడి మధ్య కుమారుడ్ని కాపాడుకుంది. అయినప్పటికీ ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఛాతీ , కడుపుపై 36 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ధ్యాన్ష్ తల్లి మనీషా కూడా తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడింది. కానీ ఆమె ధ్యాన్ష్‌ను కాపాడడంలో సక్సెస్ అయింది.
అహ్మదాబాద్ KD హాస్పిటల్‌లో ధ్యాన్ష్‌ను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో చేర్చారు. వెంటిలేటర్ సపోర్ట్, ఫ్లూయిడ్ రిససిటేషన్, రక్త మార్పిడి , అత్యంత ప్రత్యేకమైన సంరక్షణ అవసరమైంది. చిన్న వయస్సు కారణంగా చికిత్స అత్యంత సంక్లిష్టంగా ఉంది. చికిత్సలో భాగంగా, ధ్యాన్ష్ గాయాలకు స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరమైనప్పుడు తల్లి మనీషా తన చర్మాన్ని ఇచ్చింది. ఐదు వారాల చికిత్స తర్వా ధ్యాన్ష్ తో పాటు అతని తల్లి మనీషా కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
When the Air India 171 plane plunged into the BJ Medical College's residential complex here last week, Manisha Kachhadiya and her 8-month-old son Dhyaansh were in one of the buildings affected by the crash.
— Deccan Chronicle (@DeccanChronicle) June 19, 2025
Both of them sustained burn injuries in the horrific tragedy, which… pic.twitter.com/3Vc3ocWdsc
తల్లి చూపించిన ఆసాధారణ తెగువ, చర్మం దానం చేయడంతో ధ్యాన్ష్ పునర్జన్మ పొందాడు. ఈ ప్రమాదంలో బయటపడిన అతి చిన్న శిశువుగా ధ్యాన్ష్ గుర్తింపు పొందాడు.






















