Operation Mahadev: కాశ్మీర్‌లో భారత ఆర్మీ 'ఆపరేషన్ మహాదేవ్', ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం!
లిద్వాస్ ప్రాంతంలో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించినట్లు భారత సైన్యం చినార్ కార్ప్స్ X లో పోస్ట్ చేసింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది.

anti-terror Operation Mahadev in general area of Lidwas, Chinar Corps | పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన సమయంలో భారత ఆర్మ సంచలన ట్వీట్ చేసింది. ఆపరేషన్ మహదేవ్ ప్రారంభమైనట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన చీనార్ కార్ప్స్ భారీ ఎన్ కౌంటర్ చేపట్టినట్లు వెల్లడించారు. శ్రీనగర్ లోని హర్వాన్- లిద్వాస్ జనరల్ ఏరియాలో కాంటాక్ట్ ను టార్గెట్ చేశామని ఆపరేషన్ ప్రోగ్రెస్ లో ఉందని తెలిపారు. ఉగ్రవాదుల అంతు చూసేందుకు భారత ఆర్మీ తాజాగా చేపట్టిన చర్యకు ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టారు.
ముగ్గురు ఉగ్రవాదులు హతం..
పహల్గామ్ ఉగ్రవాదులు (ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టెర్రరిస్టులు) తలదాచుకున్న శిబిరాలను భారత సైన్యం కనిపెట్టి చుట్టుముట్టారు. తరువాత లిద్వాస్ జనరల్ ఏరియాలో భారీ ఎన్ కౌంటర్ జరుగుతోందని తెలిపారు. భారత ఆర్మీ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అనే ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఒక్కో ఉగ్రవాదిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే వారు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు అని ప్రచారం జరుగుతోంది.
ఆపరేషన్ సిందూర్ పై ఈ రోజు లోక్ సభలో సోమవారం చర్చ జరగాల్సి ఉండగా.. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉదయం నుంచి సభ వాయిదా పడుతోంది. ఈ సమయంలో భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ ను చేపట్టి ఉగ్రవాదులను హతం చేస్తుందని అధికారిక సమాచారం బయటకు రావడంతో ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
OP MAHADEV - Update
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025
Three terrorist have been neutralised in an intense firefight. Operation Continues.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/5LToapGKuf
జమ్మూ కాశ్మీర్‌లోని లిద్వాస్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం సోమవారం నాడు ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించింది. భారత సైన్యానికి చెందిన చీనార్ కార్ప్స్ X లో ఒక పోస్టులో, "ఓపి మహాదేవ్. జనరల్ ఏరియా లిద్వాస్‌లో కాంటాక్ట్ అయ్యారు. ఈ ఆపరేషన్ కొనసాగుతోందని" ఆర్మీ పేర్కొంది.
OP MAHADEV
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025
Contact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra
పహల్గాం ఉగ్రదాడి
ఏప్రిల్ 22వ తేదీన శ్రీనగర్ లోని బైసరన్ లోయలోని పహల్గాంలో పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ నేపాల్ వ్యక్తి సహా 26 మంది అమాయకులు చనిపోయారు. తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మే నెలలో దాడి చేసి అంతా నేటమట్టం చేసింది. మరికొన్ని ఉగ్రస్థావరాలను సైతం ధ్వంసం చేస్తామని, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో స్పష్టం చేసింది.





















