Monkeypox Virus: మంకీపాక్స్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి - కేంద్రం గైడ్‌లైన్స్ ఇవే
Monkeypox Virus: భారత్‌లో మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఇటీవలే మరణించటం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
Monkeypox Virus:
మంకీపాక్స్‌తో ఎలాంటి భయం వద్దు అని ప్రభుత్వాలు, వెద్యులు చెబుతున్న క్రమంలోనే ఇటీవల ఈ వైరస్ సోకిన వ్యక్తి ఒకరు మృతి చెందటం ఆందోళనకు గురి చేసింది. కేంద్రం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. మంకీపాక్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొన్ని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు Do's and Dont'sను వివరించింది.
ఎవరికి సోకే అవకాశముంది..?
మంకీపాక్స్ సోకిన వ్యక్తితో చాలా కాలం పాటు సన్నిహితంగా ఉన్న వారికీ ఈ వైరస్ సోకే ప్రమాదముంది. అందుకే..కాస్త అనుమానం వచ్చిన వెంటనే జాగ్రత్తపడాలని సూచిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ.
చేయాల్సినవి:
- మంకీపాక్స్ సోకిన వ్యక్తిని ఇతరులతో కలిపి ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఐసోలేట్ చేయాలి. చేతులు తరచు శుభ్రం చేసుకోవాలి. సబ్బు, లేదా శానిటైజర్‌ను వినియోగించాలి.
- మంకీపాక్స్ బాధితులకు సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితులేమైనా వస్తే కాస్త దూరం పాటిస్తూనే మాస్క్‌లు ధరించాలి. చేతులకు గ్లౌవ్స్ తొడుక్కోవాలి.
- పరిసరాలను శానిటైజ్ చేసేందుకు డిస్‌ఇన్‌ఫెక్టెంట్స్ (Disinfectants) వినియోగించాలి.
చేయకూడనివి:
- మంకీపాక్స్ సోకిన వ్యక్తి టవల్స్‌ను వినియోగించకూడదు. వాళ్లు వాడిన దిండ్లు కానీ దుప్పట్లు కానీ వాడకూడదు.
- మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానం వస్తే పబ్లిక్ మీటింగ్స్‌కు హాజరవకుండా ఉండటమే మంచిది.
- వదంతులు నమ్మి, వాటిని షేర్ చేస్తూ అనవసరంగా అందరినీ భయాందోళనలకు గురి చేయకూడదు.
#Monkeypox is usually a self-limited disease with symptoms lasting from 2 to 4 weeks.
— PIB India (@PIB_India) August 1, 2022
✅Raising awareness of risk factors and educating people about the measures they can take to reduce exposure to the virus is the main prevention strategy for Monkeypox
Do's & Don'ts⬇️ pic.twitter.com/eFSsjmHOqE
Protect yourself from #Monkeypox. Know what you should and should not do to avoid contracting the disease.
— Ministry of Health (@MoHFW_INDIA) August 3, 2022
For more information, visit https://t.co/4uKjkYncqT pic.twitter.com/Zz9tYec9JR
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..
ఈ మార్గదర్శకాలు జారీ చేయటంతో పాటు మరికొన్ని చర్యలూ తీసుకుంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ICMR పరిధిలోని 15 ల్యాబరేటరీలలో మంకీపాక్స్ శాంపిల్స్‌ను టెస్ట్ చేయనున్నారు. మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్లపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌నూ ఏర్పాటు చేశారు. దీనికి నీతిఅయోగ్ సీనియర్ సభ్యుడు వినోద్ కుమార్ పాల్ నేతృత్వం వహించనున్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మంకీపాక్స్‌పై ప్రపంచ దేశాలను అలెర్ట్ చేసింది. అప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మొత్తం 75 దేశాల్లో 16 వేల మంకీపాక్స్ కేసులు నమోదవటంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వాళ్లలో లక్షణాలు తక్కువగానే కనబడుతున్నట్టు ఓ బ్రిటీష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది.
Also Read: Naga Chaitanya : నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
Also Read: Secunderabad: నంబర్ ప్లేట్ లేదని కారు ఆపబోయిన ట్రాఫిక్ పోలీస్, డ్రైవర్ ఊహించని షాక్