Money Laundering Case: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు, వరుసగా మూడోసారి
Money Laundering Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగించింది కోర్టు.
Money Laundering Case: పత్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని మరోసారి పొడిగించారు.
Judicial custody of Shiv Sena MP Sanjay Raut extended until October 21; bail hearing to continue then.
— ANI (@ANI) October 18, 2022
Sanjay Raut has been arrested by the ED in the Patra Wala Chawl case. pic.twitter.com/0VhQR89pUN
ఈ మేరకు ఈడీ స్పెషల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 వరకు సంజయ్ రౌత్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తర్వాతనే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను కొనసాగించనున్నట్లు తెలిపింది.
ఇదీ జరిగింది
దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు.. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆగస్టు 1 అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదే కేసు
2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్ రౌత్.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ కేసులోనే రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది.
ఈ కేసులో అరెస్ట్‌కు ముందు కూడా సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
" నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి, ఏమాత్రం భయపడను. నేను బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడిని, నిజమైన శివసైనికుడిని. అతను పోరాడతాడు, ప్రతి ఒక్కరి వ్యవహారం బయటపెడతాడు. చూస్తూ కూర్చునే రకం కాదు. వాళ్లను డాన్స్ చేయనీయండి. చివరికి నిజమే గెలుస్తుంది. "