Mohan Charan Majhi Oath Ceremony: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం - తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు
Mohan Charan Majhi: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు.
Mohan Charan Majhi Takes Oath As Odisha CM: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు పాతికేళ్లుగా అక్కడ బిజూ జనతా దళ్‌దే రాజ్యం. ఆ పార్టీ కంచుకోటను తొలిసారిగా బీజేపీ బద్దలు కొట్టింది. బీజేపీ నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఇదే తొలిసారి. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కనక్ వర్దన్ సింగ్ దియో డిప్యుటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
#WATCH | BJP leader Mohan Charan Majhi takes oath as the Chief Minister of Odisha, in Bhubaneswar. Governor Raghubar Das administers him the oath to office. pic.twitter.com/Xuv1MRsHcq
— ANI (@ANI) June 12, 2024
మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా వచ్చారు. అంతకు ముందు స్వయంగా మోహన్ చరణ్ నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని భువనేశ్వర్‌లోని అన్ని ఆఫీస్‌లను మధ్యాహ్నం 1 గంట తరవాత మూసేశారు. ఈ వేడుక కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 67 పోలీసు దళాలు మొహరించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 సీట్లకు గానూ బీజేపీ 78 చోట్ల విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 30 వేల మంది హాజరైనట్టు అంచనా.