MLA Rajasingh: నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమాలపై ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు
దసరా పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యం లో ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
![MLA Rajasingh: నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమాలపై ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు MLA Rajasingh's key comments on Dandiya programs as part of Navratri celebrations MLA Rajasingh: నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమాలపై ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/7104fb636b7983953a4cee09e0e8e4841697292348421801_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమం హిందువులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఎంతో భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని, ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసభ్య కార్యక్రమలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు లోపలికి అనుమతించే ముందు తప్పకుండా ఆధార్ కార్డు అందరిదీ పరిశీలించాలని, ఇతర మతానికి చెందిన ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇదే సమయంలో తాను హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పిన రాజాసింగ్.. భారతీయ జనతపార్టీ తన విషయంలో అనుకూలంగా ఉందని.. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.
మత విద్వేష ప్రకటనలు చేసిన ఆయన్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆయన 40 రోజులకు పైగా జైలు జీవితం గడిపారు. దీంతో పార్టీకి నష్టం వాటిల్లేలా వివాదాస్పద కామెంట్స్ చేశారంటూ... రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో రాజాసింగ్ పార్టీ మారతారనే కథనాలు పెరిగిపోయాయి.
లవ్ జిహాద్ పై వ్యాఖ్యలు
ప్రసంగంలో 'లవ్-జిహాద్' గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. "హిందూ సమాజం అంతా కలిసి ఒక సంఘం ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం. మన సోదరీమణులు, కుమార్తెలు ఈ వ్యవస్థీకృత పథకాలకు బలి అవుతున్నారు. ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు లోపలికి అనుమతించే ముందు తప్పకుండా ఆధార్ కార్డు అందరిదీ పరిశీలించాలని, ఇతర మతానికి చెందిన ఎవరిని కూడా లోపలికి అనుమతించవద్దు. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం.. బీజేపీ నుంచి టికెట్ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ ఇతర పార్టీల్లో వెళ్లను.." అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
తనలో లో ప్రవహించేది కాషాయ రక్తమే అని హిందూ ధర్మ కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కష్టపడే తనను అదే ధర్మం కోసం జైల్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే అని చెప్పారు. ఈ విషయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, అభిమానులంతా తనకు అండగా నిలిచారని చెప్పారు. మీరిచ్చిన ధైర్యానికి ధన్యవాదాలు అని రాజాసింగ్ వెల్లడించారు. తన కుటుంబం అనాథ కాదు అని మీరంతా చాటి చెప్పారని తెలిపారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన పేరుతో కొంత మంది సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేలా ప్రయత్నిస్తున్నారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేస్తున్నారు. రాజాసింగ్ కు జైళ్లు, కేసులు కొత్తేమి కాదు. ఆయన క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. ఆయన చేతిలో ఉండేది కమలం జెండానే. ఆయనలో ప్రవహించేంది కాషాయ రక్తమే. ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను పసిగట్టి తిప్పికొడదాం అని రాజా సింగ్ చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)