Ministry of Civil Aviation: దేశీయ విమాన సేవలపై కీలక నిర్ణయం.. అక్టోబర్ 18 నుంచి అమలు
దేశీయ విమాన సర్వీసులకు సీట్ల పరిమితిపై ఉన్న ఆంక్షలను విమానయాన మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. అక్టోబర్ 18 నుంచి ఇది అమల్లోకి రానుంది.
దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్కు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో దేశీయ విమానాలపై పూర్తి నిషేధం విధించింది కేంద్రం.
Ministry of Civil Aviation permits to restore the scheduled domestic air operations from 18th October, without any capacity restriction pic.twitter.com/2kSbAkkd2E
— ANI (@ANI) October 12, 2021
లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. క్రమంగా పెంచుకుంటూ సెప్టెంబర్లో 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు కొవిడ్ కేసులు తగ్గుతున్నందున సీటింగ్ సామర్థ్యంపై పూర్తి ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొవిడ్ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి