(Source: ECI/ABP News/ABP Majha)
Nandini Aggarwal : చిన్న వయసులోనే CA - గిన్నీస్‌లోకి ఎక్కిన నందిని అగర్వాల్
CA : చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేయాలంటే చిన్న విషయం కాదు. కానీ ఆ అమ్మాయి అతి చిన్న వయసులోనే పూర్తి చేశారు. అది కూడా ఆలిండియా నెంబర్ వన్ ర్యాంక్. అందుకే గిన్నిస్‌లోకీ ఎక్కేశారు.
Meet worlds youngest female Chartered Accountant : సీఏ ఫైనల్ అంటే చార్టెడ్ అకౌంటెంట్‌గా అర్హత సాధించడానికి పాసవ్వాల్సిన పరీక్షను కంప్లీట్ చేయాలంటే కనీసం ఒక్కొక్కరు నాలుగైదు ప్రయత్నాలు చేస్తూంటారు. దేశంలో సివిల్స్ ఎగ్జామ్ అత్యంత క్లిష్టమైనదని అనుకుంటారు. కానీ సీఏ ఫైనల్ రాసేవారికి సివిల్సే చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరీక్షలో ఓ పందొమ్మిదేళ్ల అమ్మాయి దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ అదీ కూడా మొదటి ప్రయత్నంలో సధించింది. ప్రపంచంలోనే యంగెస్ట్ ఫీమేల్ చార్టెడ్ అకౌంటెంట్ గా గిన్నిసి రికార్డుల్లోకి ఎక్కింది. ఆ అమ్మాయి పేరు నందిని అగర్వాల్.
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు కోల్పోయిన అదానీ- అంబానీకి డేంజర్ బెల్స్
మధ్యప్రదేశ్‌లోని మెరెనా పట్టణానికి చెందిన నందిని అగర్వాల్ చిన్న తనం నంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. మొదటి నుంచి భిన్నంగా ఆలోచించేది. అందరిలా ఆమె ఇంజినీరింగ్, మెడిసిన్, సాఫ్ట్ వేర్ అని అనుకోలేదు. అందరూ అవే ఉద్యోగాలు చేస్తే ఇతర రంగాల్లో నిపుణులు ఎక్కడి నుంచి వస్తారని అనుకుంది. అందుకే టాక్సేషన్ వైపు దృష్టి పెట్టింది. డబ్బులు సంపాదించేవాళ్లు పెరిగిపోతున్నారు వారికి అవసరమైన టాక్సెషన్ సర్వీసులు అందించేవారకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక కంపెనీలు సీఏలు చేసిన వారికి లక్షల్లో జీతాలు ఇచ్చి తీసుకుంటున్నాయి. అందుకే నందిని అగర్వాల్ స్కూల్ చదువు పూర్తి కాక ముందే సీఏ కావాలని టార్గెట్ గా పెట్టుకుంది.
పదమూడేళ్లకే పదో తరగతి పూర్తి చేసింది. మధ్యలో రెండు తరగతులు ఎగ్గొట్టేసి నేరుగా పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా ఆమె మంచి మార్కులతో పరీక్ష పాస్ అయింది. మరో రెండేళ్లకు ప్లస్ టూ కూడా పూర్తి చేసింది. అంటే పదిహేనేళ్లు వచ్చే సరికి ఆమెకు ఇంటర్ కూడా పూర్తయిపోయింది. స్కూలుకు వచ్చిన ఓ ముఖ్య అతిధి చెప్పిన మాటలతో గిన్నిస్ రికార్డు సాధించాలని అనుకుంది. దానికి తన లక్ష్యం అయిన సీఏను చిన్న వయసులోనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. పదహారేళ్లకు ఎంతో ప్రతిభ చూపినా కనీసం ఇంటెర్నీగా చేర్చుకునేందుకు కూడా టాక్సేషన్ కంపెనీలు ఆసక్తి చూపించలేదు.
భార్య పేరు చెప్పుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు - లక్షల్లో డబ్బు ఆదా!
అయినా ఏ మాత్రం నిరాశపడకుండా సీఏ ఫైనల్ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2021లో జరిగిన సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ ను ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకుతో పూర్తి చేశారు. మొత్తం ఎనిమిది వందల మార్కులకు గాను నందిని అగర్వాల్ 614 మార్కులు సాధించారు. నిజానికి ఈ పరీక్ష ఎంత క్లిష్టమనదంటే.. నాలుగు వందలు మార్కులు తెచ్చుకున్న వారిని బ్రిలియంట్‌గా చెబుతూంటారు. మొత్తంగా 19 ఏళ్ల 330 రోజులకు సీఏ ఫైనల్ పూర్తి చేసి అతి చిన్న చార్టెడ్ అకౌంటెంట్ గా గిన్నిస్ రికార్డులకు ఎక్కారు.