Rama Murthy Thyagarajan: లక్ష కోట్ల వ్యాపారం ఉంది కానీ స్మార్ట్ ఫోన్, లగ్జరీ కార్ వాడరు - కానీ దానధర్మాలెక్కువ ! రతన్ టాటా గుర్తొచ్చారా ?
Thyagarajan : లక్షల కోట్ల ఆస్తి ఉన్నా రతన్ టాటా చిన్న ఇంట్లో ఉంటారు. సింపుల్‌గా బతికేవారు.దానధర్మాలు చేసేవారు. సేమ్ ఇలాంటి లక్షణాలున్న మరో వ్యాపారవేత్త త్యాగరాజన్. ఆయన గురించి పూర్తి వివరాలు ఇదిగో
Rama Murthy Thyagarajan Owner Of Rs 1 Lakh Crore Business Has No Smartphone Drives Simple Car : టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా మరణం తర్వాత ప్రపంచం అంతా ఆయనను గుర్తు చేసుకుంది. అత్యంత ధనవంతుడైనా ఎప్పుడూ లగ్జరీ లైప్ జోలికి వెళ్లని ఆయన తన ఆస్తిలో అత్యధిక భాగం చారిటీకి రాసిచ్చేశారు. అందుకే ఆయన గొప్ప వ్యక్తి అని అందరూ చెప్పుకున్నారు. భారత్ లో ఇలాంటి విలువలతో కూడిన పారిశ్రామిక వేత్తల్లో మరో లెజెండ్ రామమూర్తి త్యాగరాజన్. శ్రీరామ్ గ్రూపు కంపెనీస్ ఓనర్.
శ్రీరామ్ గ్రూపును లక్ష కోట్ల కంపెనీగా తీర్చిదిద్దిన త్యాగరాజన్
శ్రీరామ్ గ్రూపు కంపెనీస్ గురించి చాలా మంది వినే ఉంటారు. అనేక రకాల వ్యాపారాల్లో ఉన్న ఈ కంపెనీని రామమూర్తి త్యాగరాజన్ వృద్ధిలోకి తెచ్చారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కంపెనీ విలువ ఇప్పుడు లక్షా పది వేల కోట్లకు చేరుకుంది. ఎంత ఎదిగినా ఆయన ఒదిగి ఉంటారు. మాములుగా అయితే కంపెనీ ఖాతాలో అయినా సరే రాసేసి ఓ బెంట్లీ కారు కొనేసుకంటారు ఇంత భారీ కంపెనీ ఉన్న యజమానాలు. కానీ త్యాగరాజన్ ఇప్పటికీ ఓ చిన్న కారులో ప్రయాణిస్తారు. దాని విలువ ఆరు లక్షలు మాత్రమే. ఇక స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్లరు. ఆయన ఇప్పటికీ ఫీచర్ ఫోన్ వాడతారు. అలాగే చిన్న ఇంట్లోనే నివసిస్తూంటారు.
గడ్డం మాకు అడ్డం అంటున్న అమ్మాయిలు! క్లీన్ షేవ్ కావాలంటూ ఏకంగా ప్రదర్శన
చిన్న ఇంట్లో ఉంటూ సింపుల్ లైఫ్ గడిపే త్యాగరాజన్
శ్రీరామ్ గ్రూపును త్యాగరాజనే ప్రారంభించారు. డ్రైవర్లు చాలా మంది అప్పుల పాలై ఉన్నారని వారిని అభివృద్ధిలోకి తేవాలని చెప్పి స్వయంగా వారికి లోన్లు ఇచ్చి లారీ ఓనర్లను చేసేందుకు ఫైనాన్స్ కంపెనీని 1960లో ప్రారంభించారు. అప్పట్లో లారీ కొనే మొత్తానికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వచ్చేవి కావు. అదే సమయంలో ఇలాంటి సెగ్మెంట్ లో ఉన్న అవకాశాలను వినియోగించుకుని కంపెనీ భారీగా ఎదిగింది. ఎంత ఆదాయం వస్తున్నా ఆయన ఎప్పుడూ ధనవంతుడిగా వ్యవహరించలేదు.
ఆస్తిలో అత్యధిక భాగం చారిటీలకు, ట్రస్టులకు కేటాయింపు
రతన్ టాటా మాదిరిగానే త్యాగరాజన్ కూడా తన ఆస్తిలో అత్యధిక భాగం చారిటీ కోసం కేటాయించారు. ఓ సారి కంపెనీలోని తన వాటాలో కొంత భాగాన్ని అమ్మగా వచ్చిన 750 మిలియన్ డాలర్లను ఓ ట్రస్టుకు ఇచ్చేసారు.