Apple Inc : ఈ సారి యాపిల్ వంతు - కీలక పొజిషన్‌లోకి భారత మూలాలున్న టెకీ
Kevan Parekh : ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి అయిన యాపిల్ సీఎఫ్‌వోగా భారత్ మూలాలున్నకెవిన్ పరేఖ్ ఎంపికయ్యారు.
Apple new CFO : ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీలగా పేరున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటిని భారతీయులు లీడ్ చేస్తున్నారు. ఇంకా అనేక కంపెనీల్లో బారతీయులు ప్రముఖ పొజిషన్లలో ఉన్నారు. తాజాగా యాపిల్ కంపెనీ సీఎఫ్‌వోగా భారత మూలాలున్న కెవిన్ పరేఖ్ నియమితులయ్యారు. ఆయన జనవరి 1, 2025 నుంచి బాద్యతలు తీసుకోబోతున్నారు. దీంతో యాపిల్ కంపెనీలోనూ భారతీయ మూలాలున్న వారి హవా ప్రారంభమయిందని అనుకోవచ్చు.
యాపిల్లో పదకొండేళ్లుగా పని చేస్తున్న కెవిన్ పరేఖ్
కెవిన్ పరేఖ్ గత పదకొండేళ్లుగా యాపిల్లో పనిచేస్తున్నారు. యాపిల్ ఆర్థిక సామ్రాజాన్యానికి ఆయన ఆర్కిటెక్ట్ గా పని చేశారని ప్రశంసిస్తూంటారు. ప్రస్తుతానికి ఆయన ఆర్థిక విభాగానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ప్రస్తుత సీఎఫ్‌వో లూకా మేస్త్రీ యాపిల్ నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఏడాది చివరి రోజుల ఆయన లాస్ట్ వర్కింగ్ డే. అప్పటి వరకూ స్మూత్ గా కార్యకలాపాలు జరిగిపోయేలా అన్ని విషయాలపై కెవిన్ పరేఖ్ కు ఆయన సహకరిస్తారని యాపిల్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటి యాపిల్
యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైనకంపెనీల్లో ఒకటి. మూడున్నర ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కాప్ ఆ కంపెనీ సొంతం. కెవిన్ పరేఖ్ మిచిగాన్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రపంచంలోని ప్రసిద్ధ బిజినెస్ స్కూల్స్ లో ఒకటి అయిన చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. పదకొండేళ్ల ముందు యాపిల్ లో చేరడానికి ముందు ఆయన రాయిటర్స్ తో పాటు జనరల్ మోటర్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ముంబై మోడల్, బడా బిజినెస్ మ్యాన్.. మధ్యలో బెజవాడ పోలీసులు- ఓ రొమాంటిక్ చీటింగ్ కథ!
యాపిల్ ను మరో రేంజ్ కు తీసుకెళ్తాడని పరేఖ్‌పై టిమ్ కుక్ నమ్మకం
యాపిల్‌లో ఆయన తన పదకొండేళ్ల సర్వీసులో ఎన్నో గోల్స్ సాధించారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రీసెర్చ్‌లో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించారు. మార్కెట్ రీసెర్చ్ చేసి..దాన్ని నేరుగా సీఈవో టిమ్ కుక్ కు రిపోర్టు చేసేవారు. పరేక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాద్యతలు తీసుకున్న తర్వాత యాపిల్ వృద్ది ఊహించనంతగా పెరిగింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కెవిన్ పరేఖ్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఫైనాన్షియల్ బ్రిలియన్స్ కంపెనీని మరో రేంజ్ కు తీసుకెళ్తుందని టిమ్ కుక్ ధీమా వ్యక్తం చేశారు. కెవిన్ పరేఖ్ నియామకంతో.. యాపిల్ లో కొత్త ఫైనాన్షియల్ లీడర్ షిప్ అభివృద్ధి చెందినట్లేనని.. కంపెనీ కొత్త తీరాలకు చేరుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.