Delhi MCD Election Results 2022: ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యం: కేజ్రీవాల్
Delhi MCD Election Results 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు.
Delhi MCD Election Results 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ (AAP) పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) ప్రజలనుద్దేశించి మాట్లాడారు. విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆశీర్వాదాలు కావాలని కేజ్రీవాల్ అన్నారు.
I want the cooperation of the BJP & Congress to work for Delhi now. I appeal to the Centre &ask for PM's blessings to make Delhi better. We have to make MCD corruption-free. Today, the people of Delhi have given a message to the entire nation: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/oRsLUQy8RJ
— ANI (@ANI) December 7, 2022
MCD ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇది బాధ్యత
250 స్థానాలున్న దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆప్ 134 వార్డులను కైవసం చేసుకుంది. భాజపా (BJP) 104 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ (Congress) కేవలం 9 స్థానాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
Counting for #DelhiMCDPolls concludes | AAP wins 134 seats, BJP 104, Congress 9 and Independent 3. pic.twitter.com/ddyPO89lFN
— ANI (@ANI) December 7, 2022
Also Read: Delhi MCD Election Results: దిల్లీని మరోసారి ఊడ్చేసిన కేజ్రీవాల్- భాజపా 15 ఏళ్ల జైత్రయాత్రకు తెర