Sand Storm in Mumbai: ముంబయిలో ఇసుక తుఫాన్, కుప్పకూలిన 100 అడుగుల హోర్డింగ్ - ఎయిర్‌పోర్ట్‌పైనా ఎఫెక్ట్
Sand Storm: ముంబయిలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి ఇసుక తుఫాను చుట్టుముట్టి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
Sand Storm Hits Mumbai: ముంబయిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీని ఇసుక తుఫాన్ (Sand Storm in Mumbai) చుట్టుముట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు నగరమంతా చల్లబడింది. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది. అయితే..ఇసుక తుఫాను ముంచెత్తడం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రోడ్లపైన ఉన్న వాళ్లంతా ఈ తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఎఫెక్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని విమానాలు టేకాఫ్ కాకుండా నిలిచిపోయాయి. ఫ్లైట్ సర్వీస్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ చెప్పేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఘట్కోపర్‌లో చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల బిల్‌బోర్డ్ ఈ ఇసుక తుఫాను ధాటికి కుప్ప కూలిపోయింది. కింద ఉన్న పెట్రోల్ బంక్‌పై పడిపోయింది.
Giant Billboard near Eastern Express Highway, Ghatkopar East collapsed on Petrol Pump due to strong winds and dust storm that hit Mumbai today.#EEH #Mumbai #GhatkoparEast #MumbaiRains pic.twitter.com/r7xpkVK2qC
— Akshay Kumar (@fitaksh) May 13, 2024
ఈ బోర్డ్ కింద పలువురు వాహనదారులు చిక్కుకుపోయారు. వాళ్లంతా చనిపోయారంటూ స్థానికులు పెద్దగా కేకలు వేశారు. అయితే...ఇప్పటి వరకూ అధికారులు మాత్రం ప్రాణనష్టం జరిగినట్టు వెల్లడించలేదు. చిక్కుకున్న వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సోషల్ మీడియాలో ఈ తుఫాన్‌కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Wadala, Mumbai. #MumbaiRains #DustStorm pic.twitter.com/bF1uEHsyJ6
— Balaj Mehta (@BalajMehta) May 13, 2024
IMD అంచనాల ప్రకారం మహారాష్ట్రలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని IMD వెల్లడించింది. పలు చోట్ల మెట్రో సర్వీస్‌లూ నిలిచిపోయాయి. పలు స్టేషన్‌ల వద్ద ఎలక్ట్రిక్ వైర్‌లపై బ్యానర్‌లు పడిపోయాయి. పలు చోట్ల రోడ్లపైన చెట్లు కూలిపోవడం వల్ల ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది.