Manipur Bus Accident: మణిపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు విద్యార్థులు మృతి!
Manipur Bus Accident: మణిపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురైంది.
Manipur Bus Accident: మణిపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.
ఇలా జరిగింది
నోనీ జిల్లాకు చెందిన థంబాల్ను స్కూల్ విద్యార్థులు రెండు బస్సుల్లో స్టడీ టూర్‌కు వెళ్లారు. అయితే మార్గమధ్యంలో లాంగ్‌సాయ్ ప్రాంతంలో అమ్మాయిలు ప్రయాణిస్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు జారి బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
Deeply saddened to hear about the accident of a School bus carrying children. Hoping for a speedy recovery of injured students.
— Bhaskar Ghosh (@BhaskarGBJP) December 21, 2022
My heartfelt condolences to the deceased’s family.#manipuraccident #Manipur #BGSays pic.twitter.com/LzjTbMzoqS
ఘటనాస్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారని సమాచారం.. అయితే 15 మంది మృతిచెందినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరణాలపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tragic: A bus carrying students of Thambalnu Higher Secondary School Yairipok for a study tour met with an accident at Khoupum road in Noney District, #Manipur.
— Pooja Mehta (@pooja_news) December 21, 2022
15 students feared dead, several injured. pic.twitter.com/S0bH9YOqGt
సీఎం దిగ్భ్రాంతి
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన.. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు.
Visited the injured students in the accident that happened today at the Old Cachar Road.
— N.Biren Singh (@NBirenSingh) December 21, 2022
All possible help and assistance will be provided. I further pray for their speedy recovery. pic.twitter.com/MvDhI5UBKB