అన్వేషించండి

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంపై ప్రభావం చూపనుంది. భారీ వర్షాలు గాలులు వీయనున్నాయి.

నైరుతి, దాని పరిసరప్రాంతాలను ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి మాండౌస్‌గా పేరు పెట్టారు. గత 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో దాదాపు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందీ తుపాను. బుధవారం అర్థరాత్రి విడుదలైన బులెటిన్‌ బట్టీ చూస్తే... నైరుతి బంగాళాఖాతం మీదుగా చెన్నైకి ఆగ్నేయంగా 640 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంపై ప్రభావం చూపనుంది. భారీ వర్షాలు గాలులు వీయనున్నాయి. రేపు(శుక్రవారం) అర్థరాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  ఆ టైంలో గరిష్టంగా 65-75 కి.మీ.ల వేగంతో గంటకు 85 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

రేపు(శుక్రవారం) రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని దాటే సమయంలో గాలులు బీభత్సం సృష్టిస్తాయని పేర్కొంది. 

మాండౌస్ కారణంగా మూడు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 

హెచ్చరికలు:
(i) వర్షపాతం 
డిసెంబర్ 8న కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 09న తమిళనాడు పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పక్కనే ఉన్న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 డిసెంబర్ 10వ తేదీన ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో నమోదు కానుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి. 

(ii) గాలి హెచ్చరిక:
గంటకు 40-45 కి.మీ వేగంతో 55 కి.మీల వేగంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో డిసెంబర్ 8వ తేదీన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ ఉదయం నుంచి 80-90 kmph వేగంతో గాలులు మొదలవుతాయి. రాత్రి 100 kmph వరకు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి.

ప్రచండ గాలులు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈ ఉదయం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు ప్రారంభమవుతాయి. రేపు(శుక్రవారం) సాయంత్రం నుంచి డిసెంబర్ 10 ఉదయం వరకు 70-80 kmph నుంచి 90 kmph వరకు ఈదురుగాలులు వీస్తాయి. ఇది డిసెంబర్ 10 మధ్యాహ్నం నాటికి 50-60 కి.మీ వేగంతో 70 కి.మీ.కి, ఆపై డిసెంబర్ 10 రాత్రికి గంటకు 40-50 కి.మీ.కి 60 కి.మీకి తగ్గే అవకాశం ఉంది.

(iii) సముద్ర పరిస్థితి
10వ తేదీ ఉదయం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నైరుతి మరియు పరిసర ప్రాంతాలలో సముద్ర పరిస్థితి చాలా ఉధృతంగా ఉండి, ఆ తర్వాత క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి సముద్ర పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. రేపు(శుక్రవారం) పరిస్థితి మరింత ఉద్ధృతంగా ఉంటుంది. అందుకే
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే వెళ్లిన వాళ్లు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని సూచిస్తున్నారు. 

తెలంగాణలో వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఎలాంటి వాన హెచ్చరికలు లేవు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29, 16 డిగ్రీలు వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు వాతావరణంపై ప్రభావం చూపుతాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget