Maharastra News : మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకం - ఎమ్మెల్యే ఇంటికి నిరసన కారుల నిప్పు !
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఇంటిని దుండగులు తగులబెట్టారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబం కూడా సేఫ్‌గా తప్పించుకుంది.
Maharastra News : మహారాష్ట్రలోని బీడ్‌లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారుతోదంి. నిరసనల మధ్య, ఆందోళనకారులు ఎన్‌సిపి ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని ధ్వంసం చేసి, తగులబెట్టారు. సోలంకే కుటుంబ సభ్యులు ఎవరికీ గాయాలుకాలేదు. దాడి జరిగినప్పుడు తాను మా ఇంటిలో ఉన్నానని .. తనతో సహా కుటుంబసభ్యులందరూ క్షేమంగా న్నారని సోలంకిప్రకటించారు. కానీ ఉద్యమకారులు చేసిన పని కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
Law & order situation in Maharashtra turning bad to worse. Maratha Kranti morcha protestors pelted stone& burned bungalow & vehicle of DCM Ajit Pawar led NCP factions MLA Prakash Salunkhe. Several vehicles reported to be burned. Protestors demanding reservations for Maratha com. pic.twitter.com/zE3hi38Zcx
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) October 30, 2023
సోలంకి అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత. అజిత్ పవార్ వర్గం ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతం అయింది. ప్రకాష్ సోలంకి మరాఠా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న పటేల్ ను విమర్శించారు. ప్రకాష్ సోలంకి ఇంటి బయట ఉన్న వాహనాలతో పాటు ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. గత కొద్దిరోజులుగా మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతమయిన తరుణంలో ఈ ఘటన రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతుంది.
Maharashtra NCP MLA Prakash Solanke, whose residence in Beed has been attacked by Maratha reservation protestors says, "I was inside my home when it was attacked. Fortunately, none of my family members or staff were injured. We are all safe but there is a huge loss of property… https://t.co/WBjTmWvP5r
— ANI (@ANI) October 30, 2023
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా మరాఠా రిజర్వేషన్ల పోరాటం పెరుగుతోంది. రిజర్వేషన్లపై తేల్చేందుకు మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ బీజేపీ-షిండే ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిచారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రకటన చేస్తామంటూ హామీ ఇచ్చి మాట తప్పినట్టు ఆరోపించారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దీక్ష దేశంలోనే గొప్ప ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు.
మరాఠా రిజర్వేషన్ డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం బీడ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వాటర్ ట్యాంకులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఆందోళనలో సూసైడ్ చేసుకున్న వారి సంఖ్య మూడుకు చేరింది. అయితే మరాఠా ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని మనోజ్ పాటిల్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని అన్నారు. తమ ఆందోళన గురించి పట్టించుకోని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.మరాఠాల రిజర్వేషన్ కోసం దయచేసి ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని, శాంతియుత మార్గాల ద్వారా మన డిమాండ్లను పరిష్కరించుకుందామని కోరారు.
సీ కేటగిరి కింద విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొద్దికాలంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తోంది. కోటా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ, రెండో విడత నిరవధిక నిరాహార దీక్షను అక్టోబర్ 25న ప్రారంభించడంతో మరాఠా ఉద్యమ ఆందోళన ఊపందుకోనుంది. జారంగే పిలుపుపై పలు గ్రామాల ప్రజలు రాజకీయ నాయకులను తమ గ్రామాల్లోకి అడుగుపెట్టనీయకుండా నిషేధించారు. రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతుగా ఓ ఎంపీ కూడా రాజీనామా చేశారు.