Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 కోసం స్పెషల్ యాప్ - అరచేతిలో సమగ్ర సమాచారం
Maha Kumbh 2025: ఈ యాప్ కుంభమేళా గురించి దాని సంప్రదాయాలు, ప్రాముఖ్యతతో సహా లోతైన సమాచారాన్ని అందిస్తుంది. ఫుడ్ కోర్ట్స్, అట్రాక్ట్రివ్ పాయింట్లను అన్వేషించేందుకు ఉపయోగించవచ్చు.
Maha Kumbh 2025: హిందువుల అతిపెద్ద సాంస్కృతిక, మతపరమైన ఉత్సవం మహా కుంభమేళా 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు సాగనున్న ఈ మహా జాతర 45 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారన్న భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఇవి ముగింపు దశకు చేరుకున్నాయి.
ఇక ఈ సారి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వేలల్లో భద్రతా సిబ్బందితో పాటు టెక్నాలజీని కూడా విరివిగా వాడనున్నారు. ఏఐ సాంకేతికతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు మహా కుంభమేళా 2025 యాప్ పేరుతో ఓ ప్రత్యేక యాప్ ను కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని ఫెయిర్‌ను వర్చువల్‌గా అన్వేషించవచ్చు, ఈవెంట్ గురించి సమగ్ర వివరాలను యాక్సెస్ చేయడానికి ఈ యాప్ అనుమతిస్తుంది.
మహా కుంభమేళా 2025 యాప్
మహా కుంభమేళా 2025 అనే యాప్ ఈ ఉత్సవాల ప్రాముఖ్యత, సంప్రదాయం గురించి లోతైన సమాచారాన్ని అందిస్తుంది. సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత అర్థం చేసుకోవడానికి మహా కుంభమేళా గురించి పుస్తకాలు, బ్లాగ్‌లను పరిశోధించవచ్చు. మేళా అథారిటీ ప్రత్యక్ష ప్రసారం చేసిన మహాకుంభమేళా 2025 యాప్, గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
ఈ యాప్ ను ఎలా ఉపయోగించాలంటే..
- మహా కుంభమేళా 2025 యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేసి మీరు ఘాట్‌ల ఖచ్చితమైన స్థానాన్ని చూడవచ్చు. అందుకు 'Plan Your Pilgrimage' అనే సెక్షన్ లో 'గెట్ డైరెక్షన్ టు ఘాట్' ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
- మీరు దేవాలయాలు, వాటి స్థానాలను చూడాలనుకుంటే, అది 'Plan Your Pilgrimage' సెక్షన్ లో వీక్షించవచ్చు.
- తినడానికి ఉత్తమమైన ప్రదేశాలను కనుగొనడానికి స్క్రీన్ దిగువన ఉన్న మెనూ బార్‌లోని 'ఎక్స్‌ప్లోర్ ప్రయాగ్‌రాజ్' ఆప్షన్ పై క్లిక్ చేసి, 'Find out Prayagraj's Delicacies' కింద ఉన్న 'డిస్కవర్ నౌ (Discover now)'పై క్లిక్ చేయండి.
- ప్రయాగ్‌రాజ్‌లోని ఆకర్షణీయ ప్రదేశాల జాబితాను చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి. ఇది మీ ట్రిప్‌ని మరింత మెరుగ్గా చేయడంలో సహాయపడుతుంది.
- మీ పర్యటనను చిరస్మరణీయంగా మార్చే మరిన్ని ఉపయోగకరమైన అంశాలను కనుగొనడానికి యాప్‌ను ఉపయోగించవచ్చు.
యాప్ లో మరిన్ని వివరాలు
మహా కుంభమేళా 2025లో నిర్వహించే ఈవెంట్‌లు, ప్రయాగ్‌రాజ్‌ని ఎలా చేరుకోవాలి, మీ అవసరాలకు తగినట్లుగా ఉత్తమ వసతి ఎంపికలు, టూరిస్ట్ గైడ్‌లు వంటి మరిన్నింటిపై వివరణాత్మక సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పొందవచ్చు. మహా కుంభమేళా 2025 అంతటా జరిగే ఆచారాలు, ఆకర్షణలు, కుంభమేళా ఈవెంట్‌ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్ సురక్షితమైన, సంతృప్తికరమైన సందర్శన కోసం కీలకమైన చిట్కాలను కూడా అందిస్తుంది. ఇంకా, ఈ యాప్‌లో పండితులు, ఔత్సాహికులకు సహాయపడే లక్ష్యంతో ఐఐఎం (IIM) వంటి ప్రఖ్యాత సంస్థల పరిశోధన నివేదికలు ఉంటాయి. పెయింట్ మై సిటీ, స్వచ్ఛ కుంభ్, ప్రయాగ్‌రాజ్ స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఫ్యూచర్, ది మాగ్నిఫిషియెన్స్ ఆఫ్ కుంభ్ వంటి నివేదికలు కూడా యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది ప్రయాగ్‌రాజ్, మహా కుంభ్ గురించి అవగాహనను అందిస్తుంది.