LPG Price Hike: భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ కాంగ్రెస్ సెటైర్
LPG Price Hike: వాణిజ్య సిలిండర్‌పై రూ.25 ధర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
LPG Price Hike:
రూ.25 పెరుగుదల
కొత్త ఏడాది మొదటి రోజే కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో చూస్తే...ఢిల్లీ 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,768గా ఉంది. ఇవాళ్టి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే...గృహ వినియోగ సిలిండర్‌ల ధరలో మాత్రం ఏ మార్పూ చేయలేదు. దీనిపై కాంగ్రెస్ కేంద్రంపై సెటైర్లు వేసింది. ఇది ఆరంభం మాత్రమే...హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. "కొత్త ఏడాదికి మొట్టమొదటి గిఫ్ట్ వచ్చేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. హ్యాపీ న్యూ ఇయర్" అని ట్వీట్ చేసింది.
नए साल का पहला गिफ्ट 🎁🎀
— Congress (@INCIndia) January 1, 2023
कॉमर्शियल गैस सिलेंडर 25 रुपए महंगा हो गया।
अभी तो ये शुरुआत है...#HappyNewYear
ఈ పెరుగుదలతో రెస్టారెంట్‌లు, హోటళ్ల వద్ద అన్ని పదార్థాల ధరలు పెరిగే అవకాశముంది. సాధారణంగా... ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు ధరల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అదే పద్ధతిలో కొత్త ఏడాది మొదటి రోజునే ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో నగరంలో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ - ఒక్క సిలిండర్ ధర రూ, 1,769
ముంబయి - రూ. 1,721
కోల్‌కత్తా- రూ. 1,870
చెన్నై - రూ. 1,917
గతేడాది జులై 6వ తేదీన గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచారు. దాదాపు నాలుగు సార్లు పెరుగుదలతో మొత్తంగా రూ.153.5 మేర అధికమైంది. గతేడాది మార్చిలో రూ.50 పెంచారు. మళ్లీ అదే నెలలో మరోసారి రూ.50 పెంచేశారు. మే నెలలో 3.50 పెంచగా...మొత్తంగా రూ.150 కి పైగా పెంచినట్టైంది. గృహ వినియోగ సిలిండర్‌ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ- రూ. 1,053
ముంబయి - రూ. 1,052.5
కోల్‌కత్తా - రూ. 1,079
చెన్నై - రూ. 1,068.5
ప్రస్తుతం దేశంలోని సామాన్యులకు ద్రవ్యోల్బణం నుంచి ఊరట లభిస్తుందనే ఆశ కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ధరల బాదుడుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్‌లలో తప్పనిసరిగా ఫుడ్ కాస్ట్ పెంచాల్సి వస్తోంది. ఫలితంగా...మునుపటితో పోల్చి చూస్తే గిరాకీ తగ్గుతోంది. అంత ధర పెట్టి కొనాలంటే చిరు వ్యాపారులు భయపడిపోతున్నారు. వ్యాపారం ఎలా సాగించేది అంటూ వాపోతున్నారు. కరోనా తరవాత అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడం వల్ల భారత్‌పైనా ప్రభావం పడుతోంది.
Also Read: Delhi Earthquake: కొత్త ఏడాది మొదటి రోజే భూకంపం, ఢిల్లీ బెంగాల్‌లో వణికిపోయిన ప్రజలు