LPG Cylinder Price: పండుగ సందర్భంగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర, ఎంతంటే?
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్‌పై రూ. 25.5 మేర తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1859.50గా ఉంది.
LPG Cylinder Price: పండుగ సందర్భంగా ఎల్పీజీ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్కోబర్ ఒకటవ తేదీన 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై రూ.25.5 మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో పాటు విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను సైతం 4.5 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపాయి. కాగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.
తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర. రూ.1859.50కి తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశీయంగా వీటి ధరలు కాస్త తగ్గుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించడం గత జూన్ నుంచి ఇధి ఆరోసారి. మొత్తంగా రూ.494.50 తగ్గించారు. 14.2 కిలోల ఈ సిలిండర్ ధర ప్రస్తుతం దిల్లీలో రూ.1053గా ఉంది. ఇక ఏటీఎఫ్ రూ5,527.17(4.5శాతం) తగ్గించారు. దీంతో దిల్లీలో విమాన ఇంధన ధర కిలో మలీటర్ కు రూ.1,15,520.27గా ఉంది. కోల్ కతాలో దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ.1811.50గా ఉంది.
దేశంలో వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ప్రతి నెలకొకసారి సనరిస్తుంటాయి. అదే ఏటీఎఫ్ అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా ఈ ధరలను సవరిస్తారు. కాగా... గత ఆరు నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు ఇథనాల్, బయో డీజిల్ తో కలపని ఇంధనాలపై డ్యూటీ విధింపును ఒక నెల వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. లీటర్ రూ.2 చొప్పున అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధించే నిర్ణయాన్ని ఒక నెల వాయిదా వేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదనపు ఎక్సైజ్ పన్ను గడువును అక్టోబర్ 1 నుంచి వంబర్ 1కి మార్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ 10 శాతం ఇథనాల్ ను చెరకు లేదా మిగులు ఆహార ధాన్యం నుంచి సేకరిస్తున్నారు.
నెల రోజుల క్రితమే తగ్గించిన వంటగ్యాస్ ధరలు..
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా తగ్గించాయి. అయితే, ఈ తగ్గింపు ఊరట డొమెస్టిక్ సిలిండర్లపై మాత్రం వర్తించదు. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరపై మాత్రమే తగ్గింపు ఉండనుంది. గురువారం నుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై రూ.91.50 ధర తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
తాజా ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1885 కు తగ్గింది. గురువారం నుంచి కోల్‌కతాలో రూ.1995, ముంబయిలో రూ.1,844, చెన్నయ్‌లో రూ.2,045 ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర ఉండనుంది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,099.5కు చేరింది. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై రూ.91.5 తగ్గడంతో చిరు వ్యాపారులు, రెస్టారెంట్లకు కొంత ఊరట లభించనుంది.