Lok Sabha Security Breach: లోక్‌సభ భద్రతా వైఫల్యం ఘటనలో 8 మంది సస్పెండ్, కఠిన చర్యలకు ఆదేశాలు!
Security Breach Lok Sabha: లోక్‌సభ భద్రతా వైఫల్యం ఘటనలో 8 మంది భద్రతా సిబ్బందిపై లోక్‌సభ సెక్రటేరియట్ సస్పెన్షన్ వేటు వేసింది.
Security Breach in Lok Sabha:
8 మందిపై సస్పెన్షన్ వేటు..
లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే లోక్‌సభ సెక్రటేరియట్ కూడా సీరియస్ అయింది. అన్ని అంచెల భద్రతను దాటుకుని ఆ ఆగంతకులు లోపలికి ఎలా వచ్చారని సిబ్బందిని ప్రశ్నించింది. ఈ మేరకు 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.
Lok Sabha Secretariat suspends seven personnel for yesterday's security lapse incident pic.twitter.com/02FIvBimBW
— ANI (@ANI) December 14, 2023
ఈ ఘటనపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ దాడిని అందరూ ఖండించారని, అవసరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
"లోక్‌సభలో జరిగిన దాడిని అందరూ ఖండించారు. మీరు (స్పీకర్‌ని ఉద్దేశిస్తూ) కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. పార్లమెంట్‌కి లోపలికి వచ్చే వాళ్లకు పాస్‌లు జారీ చేసే విషయంలో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం"
- రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి
Defence Minister Rajnath Singh in Lok Sabha on yesterday's security breach incident
— ANI (@ANI) December 14, 2023
"Everyone has condemned this incident. You (Speaker) have taken cognizance of the matter. We have to be careful about to whom we issue the passes (to enter Parliament). All precautions possible… pic.twitter.com/bUfh6xseci