Lok Sabha Security Breach: లోక్‌సభ ఘటన నిందితులపై యాంటీ టెర్రర్ లా కేసు,విచారణ చేపట్టనున్న స్పెషల్ సెల్
Security Breach Lok Sabha: పార్లమెంట్‌లోకి దూసుకొచ్చిన నిందితులపై యాంటీ టెర్రర్ లా కింద కేసులు నమోదు చేశారు.
Security Breach in Lok Sabha:
నిందితులపై కేసు నమోదు..
లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన (Security Breach in Lok Sabha) దేశవ్యాప్తంగా సంచలనమైంది. జీరో అవర్ సమయంలో ఇద్దరు ఆగంతకులు లోపలికి వచ్చి కలర్ టియర్ గ్యాస్ ప్రయోగించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వాళ్లను ( Parliament Security Breach) అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ బయట నినాదాలు చేసిన మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీళ్లపై ఉగ్రవాది వ్యతిరేక చట్టం (anti-terror law)తో పాటు Unlawful Activities Prevention Act (UAPA) కింద కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘనటపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా విచారణ చేపట్టనుంది. నిందితుల ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్‌తో పాటు గతంలో ఎక్కడైనా ఆందోళనలు, ర్యాలీల్లో పాల్గొన్నారా అన్న కోణంలో విచారించనున్నారు. సోషల్ మీడియా యాక్టివిటీస్‌తో పాటు హిస్టరీనీ పరిశీలించనున్నారు. కేసుని పూర్తి స్థాయిలో ఢిల్లీ స్పెషల్ సెల్‌కి బదిలీ చేసే అవకాశాలున్నాయి. అయితే...ఈ నలుగురితో పాటు మరొకరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తినీ విచారిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.
కమిటీ ఏర్పాటు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ వ్యక్తి పలువురికి షేర్ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. CRPF డీజీ అనీశ్ దయాల్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఇతర భద్రతా ఏజెన్సీలకు సంబంధించిన అధికారులూ సభ్యులుగా ఉండనున్నారు. లోక్‌సభలోకి వాళ్లు ఎందుకు దూసుకొచ్చారు..? దీని వెనక కారణమేంటి..? అన్న కోణంలో ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. ఆ తరవాత అవసరమైన చర్యలు తీసుకోనుంది.
ఇలా జరిగింది..
డిసెంబర్ 13న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లోక్‌సభలో జీరో అవర్ జరుగుతోంది. ఆ సమయంలో బీజేపీ ఎంపీ మాట్లాడుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ ఆగంతుకుడు టేబుల్స్ అన్నీ దూకి సభలోకి వచ్చాడు. అప్పటికే సభలో అలజడి రేగింది. ఇంతలోనే మరో వ్యక్తి అదే గ్యాలరీలో నుంచి లోపలికి దూసుకొచ్చాడు. షూలో నుంచి క్యానిస్టర్‌లు తీసి ఎల్లో కలర్ టియర్ గ్యాస్ ప్రయోగించారు. గట్టిగా నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే పలువురు ఎంపీలు ఓ ఆగంతకుడిని పట్టుకున్నారు. అక్కడే చితకబాదారు. తరవాత భద్రతా సిబ్బంది వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. లోపలికి వచ్చిన వ్యక్తుల పేర్లు సాగర్ శర్మ, మనోరంజన్‌గా వెల్లడించారు పోలీసులు. పార్లమెంట్ బయట మరో ఇద్దరు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితమే రెక్కీ కూడా నిర్వహించారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన సాగర్ శర్మ, మనో రంజన్ డి అనే వ్యక్తులను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అమోల్ శిందే, నీలమ్‌ను పార్లమెంటు భవనం బయట అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరితో పాటు లలిత్, విక్రమ్ అనే మరో ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విక్రమ్‌ను గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకోగా.. లలిత్ కోసం గాలింపు చేపట్టారు. పార్లమెంటుకు వచ్చే ముందు వీరంతా గురుగ్రామ్‌లోని విక్రమ్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రణాళిక ప్రకారం ఆరుగురూ పార్లమెంటు లోపలికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇద్దరికే విజిటర్ పాసులు దొరికాయి. నాలుగేళ్లుగా ఒకరితో ఇంకొకరికి పరిచయం ఉందని.. సామాజిక మాధ్యమాల వేదికగా కాంటాక్టు అయ్యేవారని పోలీసులు గుర్తించారు.
Also Read: అయోధ్య ట్రస్ట్ వద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తి