అన్వేషించండి

Lok Sabha Election 2024: హద్దులు దాటితే ఊరుకోం, రాజకీయ పార్టీల ప్రచారంపై ఈసీ వార్నింగ్

Lok Sabha Election 2024: ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు హద్దు దాటొద్దని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.

Lok Sabha Election 2024 Schedule: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని, అందరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ (Model Code of Conduct) గురించి ప్రస్తావించారు. ప్రచారం చేసే సమయంలో రాజకీయ పార్టీలు హద్దులు మీరి ప్రవర్తించొద్దని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అనవసరంగా ఎవరూ నోరు జారొద్దని స్పష్టం చేశారు. స్టార్ క్యాంపెయినర్ల బాధ్యతలకు సంబంధించీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే చాలా సార్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ నిబంధనని ఉల్లంఘించిన ఘటనలు నమోదయ్యాయని,వాటిని దృష్టిలో పెట్టుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కులం, మతం పేరుతో దూషించుకోడంపైనా హెచ్చరించారు. అలాగే వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు రాజీవ్ కుమార్. మార్గదర్శకాల్లో ఇవి కూడా ప్రస్తావించినట్టు తెలిపారు. 

"ఇప్పటికే చాలాసార్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. రాజకీయ పార్టీలన్నింటినీ అప్రమత్తం చేశాం. స్టార్ క్యాంపెయినర్లు అందరికీ మేం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని కాపీలని పంపాలని సూచించాం. ప్రచారం చేసే వాళ్లందరికీ ఈ గైడ్‌లైన్స్ వర్తిస్తాయి. కచ్చితంగా ఆ నిబంధనలు పాటించాలి. గతంలోనూ ఇలా చేసినా రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అంత సులభంగా తీసుకోం. నిబంధనలు ఉల్లంఘిస్తే అవసరమైన చర్యలు తీసుకోడానికి ఏ మాత్రం వెనకాడం"

- రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget