Liquor Shops Ban : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - ఆ 17 ప్రాంతాల్లో షాపులు బంద్ - సర్కార్ కీలక నిర్ణయం
Liquor Shops Ban : మధ్యప్రదేశ్‌లోని 17 ప్రధాన పవిత్ర నగరాల్లో మందు దుకాణాలను మూసివేస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.

Liquor Shops Ban : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పవిత్ర పట్టణాల్లో మద్యం దుకాణాలపై నిషేధం ప్రకటించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నిషేధంపై దృష్టి సారించిన సర్కారు.. మొదటి విడతలో 17 ముఖ్య నగరాల్లో నిషేధాజ్ఞలు విధించేలా ఆదేశాలు జారీ చేశామని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. వీటిలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు నగర పాలికలు, ఆరు నగర పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించడంలో తొలి అడుగుగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం మోహన్ యాదవ్ వివరించారు. అయితే ఈ 17 నగరాల్లో ఆయన స్వస్థలమైన ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉండడం గమనార్హం.
ఈ నగరాల్లో మద్యం దుకాణాలపై నిషేదాజ్ఞలు
చిత్రకూట్, కుందల్‌పూర్, అమర్‌కంటక్, సల్కాన్‌పూర్, బర్మన్ కాలా, లింగ, బండక్‌పూర్, దాతియా, మండలేశ్వర్, పన్నా, మైహర్, ముల్తాయ్, మందసౌర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, బర్మన్ ఖుర్డ్, ఓర్ఛా.
మద్యం దుకాణాల నిషేధంపై సీఎం ఏమన్నారంటే..
మహేశ్వరంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం మోహన్ యాదవ్ మద్యం నిషేధంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. తాము నిర్ణయించిన, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలనకు ఎక్కడికీ తరలించమని, శాశ్వతంగా మూసివేస్తామని చెప్పారు. మద్యం నిషేధించిన ప్రాంతాలన్నీ మతపరమైన పుణ్యక్షేత్రాలేనని. నర్మదా నది ఒడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలోని లిక్కర్ షాపులనూ బంద్ చేపిస్తామన్నారు. భవిష్యత్తులోనూ ఈ నిర్ణయం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము మధ్యప్రదేశ్ లో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఇది తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.
राज्य शराबबंदी की दिशा में आगे बढ़े, इसके लिए हमने प्रथम चरण में 17 धार्मिक नगरों में शराब बिक्री पर प्रतिबंध लगाने का निर्णय लिया है।#महेश्वर_में_एमपी_कैबिनेट pic.twitter.com/oGWtuXiPe3
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 24, 2025
సీఎం నిర్ణయంపై హర్షాతిరేకాలు
తాజాగా మోహన్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పుణ్యక్షేత్రాల్లో పవిత్రంగా ఉండడం చాలా ముఖ్యమని, ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసేయడం మంచి నిర్ణయమని కొనియాడుతున్నారు. ఈ తరహా నిర్ణయాలు భవిష్యత్ తరాలు మద్యానికి బానిస కాకుండా చేస్తాయని అంటున్నారు. యువతను సన్మార్గంలో నడిపేందుకు ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని, ఈ రోజుల్లో మందు తాగడాన్ని ఓ స్టేటల్ గా భావిస్తున్నారంటున్నారు. నిజానికి ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు.. ఇప్పుడు బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల పుణ్యక్తేత్రాలున్న ప్రాంతాల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | Madhya Pradesh CM Mohan Yadav-led state government approves ban on liquor in 17 holy cities of the state.
— ANI (@ANI) January 24, 2025
A resident of Ujjain says, "It will take youth towards the righteous path. Nowadays, drinking has become a status symbol for the youth; this decision will help… pic.twitter.com/SJGTq6MtCP
Also Read : Budget Halwa: బడ్జెట్ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?





















