అన్వేషించండి

AP Liquor prices: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు షాక్‌-మరోసారి పెరిగిన మద్యం ధరలు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. క్వార్టర్‌పై 10 రూపాయలు, ఫుల్‌బాటిల్‌పై 20 రూపాయలు పెంచింది ఏపీ ప్రభుత్వం. పెరిగిన ధరలు అమల్లోకి కూడా వచ్చేశాయి.

Liquor Prices Increased In AP: ఇకపై చుక్కేయాలంటే చుక్కలే... క్వార్టర్‌ (Quarter) కూడా క్లాస్ట్‌లీ అయిపోయింది. ఇక ఫుల్‌బాటిల్‌ సంగతి అయితే చెప్పన్నక్కర్లేదు. ఫుల్‌బాటిల్‌ కొనాలంటే ఫుల్లు పైసలు కావాల్సిందే. పెరిగిన మద్యం ధరలు.. మందుబాబులకు మత్తు దిగేలా చేస్తున్నాయి. కైపులో కూడా కెవ్వు మంటున్నారు మద్యం ప్రియులు. 

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మరోసారి మద్యం (Liquor) ధరలు పెరిగాయి. అంతేకాదు పెరిగిన ధరలు ఇవాళ్టి (శనివారం) నుంచే అమల్లోకి కూడా వచ్చేశాయి. క్వార్టర్‌పై 10 రూపాయలు... ఫుల్‌బాటిల్‌పై 20 రూపాయలు పెంచేసింది ఏపీ ప్రభుత్వం. ఇక.. ఫారిన్‌ లిక్కర్‌పై అయితే ఏకంగా 20శాతం వరకు ధరలు పెంచేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నిజంగా షాకే అంటున్నారు మందుబాబులు. 

మద్యంపై విధించే అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ARET)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ఎక్సైజ్‌ శాఖ. ఏఆర్‌ఈటీ శ్లాబులు  రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవు. కనుక... అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చింది ఎక్సైజ్ శాఖ.  దీని వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పన్నుల భారం ఒకేలా పడనుంది. అంతేకాదు... కొన్ని మద్యం బ్రాండ్లపై ధరలు కూడా తగ్గాయి. 

ఐఎంఎఫ్ఎల్‌ (IMFL) కనీస ధర 2వేల 500 రూపాయల లోపు ఉంటే దానిపై 250 శాతం పెరిగింది. 2వేల 500 రూపాయలు దాటితే 150 శాతం పెరిగింది. ఇక బీరుపై 225 శాతం,  వైన్‌పై 200 శాతం ధరలు పెరిగాయి. ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ పెరిగింది. దీనికి బట్టి... ఒక ఫుల్‌ బాటిల్‌ ప్రస్తుతం 570 రూపాయలు ఉంటే... ఇప్పుడు 590  రూపాయలు అయ్యింది. అంటే 20 రూపాయలు పెరిగింది. మరో బ్రాండ్‌ క్వార్టర్‌ 200 రూపాయల నుంచి 210 రూపాయలకు పెరిగింది. కొన్ని బ్రాండ్లలో క్వార్టర్ బాటిల్‌పై 10  నుంచి 40 రూపాయల వరకు, హాఫ్ బాటిల్‌పై 10 నుంచి 50 రూపాయల వరకు, ఫుల్ బాటిల్‌పై 10 నుంచి 90 రూపాయల వరకు ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.

ఫారిన్‌ లిక్కర్‌పై చాలాకాలంగా ధరలు పెరగలేదు. పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు.. ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి రజత్‌ భార్గవ. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20శాతం పెంచారు. విదేశీ మద్యం బ్రాండ్ల కొనుగోలు ధరలు పెంచటం వల్ల ఆయా బ్రాండ్ల ఎమ్మార్పీ పెరిగింది.

ఇక... 150రూపాయలుగా ఉన్న 180 ఎంఎల్ లిక్కర్ సీసా ధర...  ప్రస్తుతం అలాగే ఉంది. అయితే 750 ఎంఎల్ మద్యం బాటిల్ ధర కూడా అలాగే కొనసాగుతోంది. కొన్ని లిక్కర్ బ్రాండ్లపై మాత్రం ధరలు పెరిగింది. 180 ఎంఎల్ 200 నుంచి 210 రూపాయలు పెరిగింది. కొన్ని 750 ఎంఎల్ లిక్కర్ సీసా ధర 4వేల 330 నుంచి 5వేల 450కి పెరిగింది. అంటే.. 11వందల 20 రూపాయలు పెరిగింది. ఇలా... కొన్ని బ్రాండ్లపై ట్యాక్స్‌ ప్రభావం పడితే... మరికొన్ని బ్రాండ్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. 

ఏదిఏమైనా... ఇప్పటికే ఏపీలో చాలాసార్లు మద్యం ధరలు పెంచారు. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో మద్యం వినియోగదారులు లబోదిబో అంటున్నారు.  ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget