Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు, చంపేస్తామని వాట్సాప్‌లో వార్నింగ్
Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.
Sanjay Raut Death Threat:
ఢిల్లీలోనే చంపేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్
ఉద్ధవ్ థాక్రే శివసేవనకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనను చంపేస్తామని బెదిరించినట్టు సంజయ్ రౌత్ పోలీసులకు వెల్లడించారు. ఆయన వాట్సాప్ నంబర్‌కు ఆ గ్యాంగ్ నుంచి మెసేజ్ వచ్చింది. AK-47తో ఢిల్లీలోనే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను ఎలా అయితే హత్య చేశామో...అదే విధంగా చంపేస్తామని హెచ్చరించింది. ఈ బెదిరింపులు వచ్చిన వెంటనే సంజయ్ రౌత్ అలెర్ట్ అయ్యారు. ఆ వివరాలన్నింటినీ ముంబయి పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. విచారణ జరిపించాలని కోరారు. "నువ్వో హిందూ వ్యతిరేకివి. తప్పకుండా చంపేస్తాం" అని మెసేజ్ పంపించారు. తనకు ప్రాణహాని ఉందని గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు రౌత్. మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఇదే విషయాన్ని అప్పట్లో వివరించారు. ఇప్పుడు నేరుగా ఆయన సెల్‌కే మెసేజ్ రావడం ఆందోళన కలిగించింది. అంతకు ముందు ఇదే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కూ వార్నింగ్ పంపాయి. గతేడాది మార్చిలో సల్మాన్ ఖాన్ ఆఫీస్‌కు కాల్ చేసి బెదిరించింది బిష్ణోయ్ గ్యాంగ్. జింకను వేటాడినందుకు ఆయనను చంపేస్తామని హెచ్చరించింది. "సారీ చెప్పండి లేదంటే తరవాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి" అని సల్మాన్ భాయ్‌ను బెదిరించింది. వెంటనే అప్రమత్తమైన సల్మాన్...పోలీసులకు సమాచారం అందించారు.
Maharashtra | Shiv Sena (Uddhav Thackeray) leader & RS MP Sanjay Raut received a threat message from Lawrence Bishnoi gang mentioning murdering him like Punjabi Singer Sidhu Moose Wala in Delhi. Sanjay Raut has filed a complaint. Police are conducting probe: Police
— ANI (@ANI) April 1, 2023
(File Pic) pic.twitter.com/LXMQKP1fp1
బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల కారణంగా హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గతేడాది జూన్ 6 నుంచి సల్మాన్ ఇంటి వద్ద సాయుధ పోలీసులతో కూడిన వ్యాన్‌ను ఉంచారు. తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలోనూ సల్మాన్ ఖాన్ నగరంలోని పార్క్ హయత్ హోటల్లో బస చేయడంతో అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ ఖాన్‌కు పడుతుందని లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల బెదిరించారు. ఈ మేరకు బిష్ణోయ్ రాసిన లేఖ సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్‌కు వచ్చింది. బెదిరింపు లేఖ కారణంగా సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు జారీ చేయాలని పెట్టిన వినతి మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆయనకు తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు.
" నటుడు సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్ జారీ చేశాం. బెదిరింపు లేఖలు రావడంతో ఆత్మ రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ కావాలని సల్మాన్ ఖాన్ అభ్యర్థించారు. దీంతో లైసెన్స్‌కు అనుమతించాం. "
-ముంబయి పోలీసులు