Abhinav Arora: నేటి సోషల్ మీడియా స్టార్ పిల్ల బాబా అభినవ్ అరోరా - బిష్ణోయ్ గ్యాంగ్ కూడా బెదిరిస్తోందట !
Lawrence Bishnoi: ఉత్తరాదిన ఓ పదేళ్ల బాలుడు సోషల్ మీడియాకు.. మీడియాకు హాట్ టాపిక్ గా మారారు. చివరికి బిష్ణోయ్ గ్యాంగ్ కూడా బెదిరిస్తోందట. అసలు ఎవరీ బుల్లి బాబా ?
Lawrence Bishnoi gang threatened to kill Abhinav Arora: అభినవన్ అరోరా అంటే చాలా మందికి తెలియదు కాదు పదేళ్లకే అధ్యాత్మిక ప్రసంగాలు చేసే పిల్ల బాబా అభివన్ అరోరా అంటే చాలా గుర్తింపు ఉంటుంది. తాను పుట్టుకతోనే దైవాంశ సంభూతుడన్నట్లుగా ప్రవచనలు చెబుతూ ఉంటారు అభివన్ అరోరా. దీంతో ఆయనకు చాలా పెద్ద పేరు వచ్చేసింది. పిల్లలూ..దేవుడూ ఒకటే అనే ప్రచారాన్ని ఆయన తల్లిదండ్రులు ఉద్ధృతంగా చేసుకున్నారు. మూడేళ్ల నుంచే తాను ప్రవచనాలు చెబుతున్నానని చెబుతూంటాడు.
అభినవ్ అరోరా అవడానికి చిన్న పిల్లాడే కానీ తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువే. ఎందుకంటే పెద్ద బాబాలు ఎవరైనా ఏదైనా కార్యక్రమం పెడితే నిర్మోహమాటంగా వెళ్లిపోతారు. స్టేజ్ మీద తనకో చోటు చూసుకుంటారు. అందరి దృష్టిలో పడేలా వ్యవహరిస్తారు. ఆ పిల్లవాడి తీరుతో చాలా మంది స్వామిజీలు కూడా ఫీలయ్యేవారు. తాజాగా రామభద్రాచార్య అనే స్వామిజీ ప్రవచనలు చెప్పి, భజన చేస్తున్న సమయంలో ఆయన పక్కనే నిల్చుకుని అతి చేయడంతో కోపం వచ్చిన స్వామిజీ ఆయనను స్టేజి నుంచి దింపేశారు. ఈ వీడియో వైరల్ అయింది.
Swami Rambhadracharya is blind but he can see that golu Abhinav Arora is fooling us - instead of doing his homework. When will you see this?
— The DeshBhakt 🇮🇳 (@TheDeshBhakt) October 24, 2024
When will Hindus understand that their religious sentiments are being abused by others for fame & profit? pic.twitter.com/ERGbw325uv
అయితే తనకు స్వామిజీపై కోపం లేదని ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి అని అభినవ్ అరోరా క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఉత్తరాదిలో సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. కొంత మంది అభినవ్ అరోరాకు మద్దతుగా మరికొంత మంది స్వామిజీకి మద్దతుగా వాదనలు చేసుకుంటున్నారు.
ఈ హడావుడి జరుగుతున్న సమయంలోనే అభినవ్ అరోరా తల్లి తమకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ప్రకటించారు. ఈ అంశం కలకలం రేపుతోంది. ముందుగా ఓ మిస్డ్ కాల్ వచ్చిందని తాము పట్టించుకోలేదని తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు పంపారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాకు తెలిపారు.
#WATCH | Mathura, UP: Family of Abhinav Arora claims that he received a life threat from Lawrence Bishnoi gang.
— ANI (@ANI) October 28, 2024
His mother, Jyoti Arora says, "...We received a call message from Lawrence Bishnoi group today where we were being threatened that Abhinav would be killed. Last… pic.twitter.com/A89FNRvOCN
అయితే అటెన్షన్ కోసమే అభినవ్ అరోరా తల్లిదండ్రులు ఇలా చేస్తూంటారని నెటిజన్లు ఆరోపిస్తూ ఉంటారు.