Land For Job Scam: లాలూకి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు, మార్చి 29న మరోసారి విచారణ
Land For Job Scam: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Land For Job Scam:
బెయిల్ మంజూరు..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో భాగంగా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనతో పాటు రబ్రీదేవి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది కోర్టుకు వచ్చారు. విచారణ తరవాత లాలూ, రబ్రీ దేవి, ఎంపీ మీసా భారతికి కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మార్చి 29వ తేదీన మరోసారి విచారించనున్నట్టు ప్రకటించింది కోర్టు. లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి కోర్టుకి వచ్చి జడ్డ్ ముందు హాజరయ్యారు. ఆ వెంటనే ఈ ముగ్గురూ బెయిల్ పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు రూ.50 వేల పర్సనల్ బాండ్‌పై బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. బీజేపీ మాత్రం ఈ విషయంలో లాలూపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కొందరు RJD నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసుపై చర్చ జరుగుతోంది. లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేశారని కొందరు వాదిస్తున్నారు. లాలూకి బెయిల్ రావడంపై RJD నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నేతలకు మిఠాయిలు పంచారు. దీనిపై అసహనం వ్యక్తమైంది. ఇరు వర్గాలు లడ్డూలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు.
Land-for-job case: Lalu Yadav, Rabri Devi, Misa Bharti get bail in CBI case
— ANI Digital (@ani_digital) March 15, 2023
Read @ANI Story | https://t.co/jYzeVC66hz#LaluYadav #bail #LandForJobScam #RabriDevi pic.twitter.com/UGSqbM8EBF
#WATCH | Bihar: Ladoos were thrown as RJD & BJP MLAs enter into a scuffle at the State Assembly after RJD MLA offered BJP MLAs sweets following the bail to Lalu Yadav, Rabri Devi, Misa Bharati in land-for-job case. pic.twitter.com/ylCRNowl2S
— ANI (@ANI) March 15, 2023
2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున స్థలాలు తమ పేరిట రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రిక్రూట్మెంట్ చేశారని సీబీఐ చెబుతోంది. జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తుల్నీ రిఫరెన్స్ ద్వారా రిక్రూట్ చేశారని అంటోంది. లాలూని రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీసింది ఈడీ. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మొత్తం 14 మంది పేర్లు చేర్చింది. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు.
Also Read: Fuel Tax Rates: చమురొక కల్పవృక్షం, సర్కారు ఎంత సంపాదిస్తోందో మీరు ఊహించలేరు