KV Subramanian Steps Down: రాజీనామాపై ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియమ్ కీలక ప్రకటన... తిరిగి ప్రొఫెసర్ బాధ్యతలు చేపడతానని ట్వీట్
భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియమ్ తన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు. మూడేళ్ల పదవీకాలం ముగియగానే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(CEA) కృష్ణమూర్తి సుబ్రమణియమ్ తన పదవీ రాజీనామాపై స్పష్టత ఇచ్చారు. తన మూడేళ్ల పదవీకాలం పూర్తయిన వెంటనే బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తిరిగి అకాడమీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సుబ్రమణియన్ చెప్పారు.
Also Read: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ యథాతథంగానే వడ్డీ రేట్లు.. శక్తికాంతదాస్ వెల్లడి
"భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా 3 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత నేను తిరిగి ప్రొఫెసర్ గా విధులు నిర్వహించేందుకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను" అని సుబ్రమణియన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
I have decided to return back to academia following the completion of my 3-year fulfilling tenure. Serving The Nation has been an absolute privilege 🙏and I have wonderful support and encouragement🙏. My statement: @PMOIndia @narendramodi @FinMinIndia @nsitharamanoffc @PIB_India pic.twitter.com/NW5Y64kxJ6
— K V Subramanian (@SubramanianKri) October 8, 2021
తదుపరి సలహాదారును కేంద్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. డిసెంబర్ 7, 2018లో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి సుబ్రమణియమ్ బాధ్యతలు చేపట్టారు. గత సీఈఏ అరవింద్ సుబ్రమణియమ్ రాజీనామా అనంతరం దాదాపు ఐదు నెలల తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్ సుబ్రమణియమ్ తన పదవీకాలం పూర్తి కాకముందే బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ లో కేవీ సుబ్రమణియమ్ పేరు సుపరిచితం.
Also Read: విదేశీ శక్తులను భారత గడ్డపై అడుగుపెట్టనివ్వం: వాయుసేన అధిపతి
సుబ్రమణియమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల పరిపాలన నిపుణుల కమిటీలో పనిచేశారు. బంధన్ బ్యాంక్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లో డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా పనిచేశారు. సీఈఏగా ఉన్న సుబ్రమణియన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్‌లో ఫైనాన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుబ్రమణియన్ ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థ యూనివర్సిటీ ఆఫ్ చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పీహెచ్‌డీ పొందారు.
Also Read: సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?.. యూపీ సర్కార్‌పై సుప్రీం ఫైర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















