By: ABP Desam | Updated at : 22 Jan 2023 10:23 AM (IST)
Edited By: jyothi
చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ - 8 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Konaseema District News: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాజమండ్రికి చెందిన ఒక మైనర్ తో సహా నలుగురు అంతర జిల్లా దొంగలు ఉన్నారు. పట్టుబడిన నిందితులనుండి 7 లక్షల 75 వేల రూపాయల విలువైన సొత్తు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి అమలాపురం డీయస్పీ వై మాధవ రెడ్డి తెలిపారు. నిందితులపై 14 కేసులున్నట్లు చెప్పారు.
నిందితులపై ఎనిమిది పోలీస్ స్టేషన్లలో 14 కేసులు
రాజమండ్రికి చెందిన గొర్రెల చినబాబు, టేకుమూడి దుర్గా ప్రసాద్, ఉప్పులూరి భాస్ర శివరాజు లతొ సహా ఒక బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. వీరిపై వివిధ జిల్లాల్లోని ఎనిమిది పోలీస్టేషన్ల పరిధిలో 14 కేసులు ఉన్నాయని డీయస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 56.7 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 3 కిలోల వెండి, 20 వేల రూపాయల నగదు, రెండు మోటార్ సైకిళ్లు లక్ష రూపాయల విలువ చేసే ఇతర సామగ్రీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇటీవలే గుంటూరులో ఇద్దరి అరెస్ట్..!
గుంటూరు లక్ష్మీపురం మహావీర్ జ్యూవెలరీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.షేక్ ఆలీ, చిలకా రత్నరాజులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి ఒక కేజి 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల 35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహావీర్ జ్యూవెలరీ దుకాణం షట్టర్ ను తొలగించి దుండగులు చోరీకి పాల్పడ్డారు.ఈ ఇద్దరు నిందితులు గతంలో ఏటీఏం చోరికి యత్నం, మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు.
ఆ దొంగల టాలెంట్ చూస్తే మతి పోవాల్సిందే..!
గ్యాస్ కటర్ తో తాళాలను కట్ చేసి నగదు, బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నవంబర్ లో జరిగిన ఈ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు తాపీగా తమ పని ముగించారు. షేక్ లీ పాత గుంటూరుకు చెందని వ్యక్తి.. అతడు టింకరింగ్ షాపులో పనిచేస్తాడు. ఇక మరో నిందితుడు చిలకా రత్నరాజు లారీ డ్రైవర్. అయితే వీరిద్దరి ప్రవృత్తి నేరాలు కావటం విశేషం. మొదట్లో ఇద్దరు వేర్వేరుగా చిల్లర నేరాలు చేసేవారు. అయితే వాటి ద్వారా ఎక్కువ ఆదాయం లభించకపోవటంతో ఇద్దరు కలుసుకొని నేరాలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా నవంబర్ 20వ తేదీన రాత్రి లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న మహావీర్ జ్యూయలరీ షాప్ తాళాలను గ్యాస్ కటర్ తో కట్ చేసి దొంగతానికి పాల్పడ్డారు. చాలా ఈజీగా తమ పని ముగించారు. నిందితులు గ్యాస్ కట్టర్ తో తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లి కేజీకి పైగా బంగారం దోచుకుంటుంటే ఎవ్వరికి అనుమానం రాలేదంటే వారి టాలెంట్ ఏంటో అర్దం అవుతుంది.
Breaking News Live Telugu Updates: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా?: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Nizababad Politics: కారు దిగి సైకిల్ ఎక్కనున్న మాజీ మంత్రి - త్వరలో టీడీపీలో చేరనున్న మండవ !
Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!
Jammu Kashmir Survey: పాకిస్థాన్లో కలిసే ప్రసక్తే లేదన్న కశ్మీరీలు,స్వతంత్రతే కావాలని ఓ సర్వేలో వెల్లడి
Kondagattu Temple: కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు - థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!