Kisan Mahapanchayat: 'దేశం అమ్ముడుపోకుండా కాపాడాలి.. ప్రాణాలు పోయినా తగ్గేదే లేదు'
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉత్తర్ ప్రదేశ్ లో కిసాన్ మాహాపంచాయతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. విజయం సాధించేంతవరకు వెనక్కి తగ్గేదేలేదని బీకేయూ నేత టికాయత్ అన్నారు.
సాగు చట్టాలపై రైతుల పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది. ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో 'సేవింగ్ ది కంట్రీ' పేరుతో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి వేలాదిమంది రైతులు హాజరయ్యారు. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ ఈ సభ జరగడంతో దేశం మొత్తం చూపు ఇక్కడ పడింది.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో బీకేయూ నేత రాకేశ్ టికాయత్ మాట్లాడారు.
#WATCH ये कहते हैं कि लाल किले पर किसान गया। लाल किले पर नहीं, किसान अगर जाता तो संसद जाता जहां क़ानून बने हैं। लाल किले पर धोखे से लेकर गए हैं आप हमको। हमारे लोग नहीं गए, धोखे से लेकर आप लोग गए हैं: किसान नेता राकेश टिकैत, मुज़फ़्फ़रनगर में pic.twitter.com/YxkXsANRzN
— ANI_HindiNews (@AHindinews) September 5, 2021
ఇలాంటి సమావేశాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. దేశం అమ్ముడుపోకుండా మనం కాపాడాలి. రైతులతో పాటు దేశాన్ని కూడా కాపాడాలి. ఉద్యోగులు, వ్యాపారాలు, యువతను కూడా కాపాడాలి. ఇదే ఈ సమావేశం ముఖ్య లక్ష్యం.
మా శ్మశాన వాటికలు అక్కడ సిద్ధం చేసినా కూడా దిల్లీ సరిహద్దులను వదిలి వెళ్లమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అవసరమైతే మా ప్రాణాలనే వదిలేస్తాం. అంతేకానీ విజయం సాధించేవరకు వదిలే ప్రసక్తే లేదు.
రాకేశ్ టికాయత్, బీకేయూ నేత
"रणसिंघा"
— Kisan Ekta Morcha (@Kisanektamorcha) September 5, 2021
पुराने समय में जब इज़्ज़त मान सम्मान के लिए युद्ध लड़े जाते तो इसी यंत्र से आह्वान किया जाता था।
आज भाजपा-कॉरपोरेट राज के खिलाफ समस्त किसान मजदूर ने युद्ध का आह्वान किया है।#मुजफ्फरनगर_किसान_महापंचायत pic.twitter.com/1BCI3GvR4s
ఈ సమావేశం కోసం దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా రైతు సంఘాల నుంచి అన్నదాతలు ఇక్కడకు వచ్చినట్లు బీకేయూ మీడియా ఇంఛార్జి ధర్మేంద్ర మాలిక్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి రైతులు సమావేశానికి తరలివచ్చారన్నారు. 5 వేలకు పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సులు, కార్లు, ట్రాక్టర్లపై ఈ సభకు చేరుకున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళా రైతు సభలో కన్నడలో మాట్లాడారు.