Kinjarapu Rammohan Naidu : విమానాలకు బెదిరింపు కాల్స్ చేస్తే ఇక వదిలి పెట్టరు - కీలక నిర్ణయాలు ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Threat Calls to Planes :విమానాలకు వరుసగా వస్తున్న తప్పుడు బెదిరింపుల్ కాల్స్ ను కేంద్ర విమానయాన శాఖ సీరియస్ గా తీసుకుంది. ఇలా చేస్తున్న వారు జీవితాంతం బాధపడే చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి హెచ్చరించారు.
Central Aviation Department has taken the threat calls to the planes seriously : విమానం బయలుదేరుతున్న సమయంలో బాంబు పెట్టాం అంటూ కొన్ని కాల్స్ ఎయిర్ పోర్టులకు వస్తున్నాయి. ప్రయాణికుల భద్రత విషయంో ఏ చిన్న అంశాన్నీ తేలికగా తీసుకోలని విమానయాన మంత్రిత్వ శాఖ అలా బెదిరిపులు వచ్చిన ప్రతి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఫలితంగా ఆ విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఇవి అంతకంతకూ పెరిగిపోతూండటంతో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి హోక్స్ కాల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మొత్తంగా రెండు అంశాల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరి్టీ రూల్స్ లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఎవరైనా తప్పుడు కాల్స్ చేసినట్లుగా గుర్తిస్తే ముందుగా వారిని నో ఫ్లైయింగ్ ప్యాసింజర్స్ లిస్టులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కొంత మంది సరైన సమయానికి విమానశ్రయానికి చేరుకోలేకపోతే... ఏదైనా పబ్లిక్ ఫోన్ లేదో మరో టెక్నికల్ గా దొరకని అవకాశాన్ని ఉపయోగించుకుని కాల్స్ చేసి బాంబు బెదిరింపులు చేస్తున్నారు. ఫలితంగా ఆ విమానం టేకాఫ్ ఆలస్యం అవుతోంది. ఇలాంటి వాటి సంఖ్య పెరుగుతూండటంతో.. ఓ సారి ఇలా చేస్తే మరోసారి అసలు విమాన ప్రయణానికి అర్హత లేకుండా చేయాలని కేంద్ం ఆలోచిస్తోంది. విమానాల భద్రత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేలా .. తప్పుడు కాల్స్ చేయడాన్ని కాగ్నిజెబుల్ అఫెన్స్‌గా గుర్తిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కఠినమైన శిక్షలతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు.
#WATCH | Delhi: Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu speaks on recent hoax bomb calls on several domestic and international flights.
— ANI (@ANI) October 21, 2024
He says, "...From the Ministry, we have thought of some legislative action if it is required. We have come to the conclusion that… pic.twitter.com/q0K6MxOgK8
ఈ మధ్య కాలంలో ఎయిర్‌పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్, కాల్స్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పెరిగిపోతున్నది. ఇటీవల రోజుకు 10కిపైగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తన్నాయి. ఆదివారం రోజు ఏకంగా బెదిరింపు కాల్స్ అందుకున్న విమానాల్లో ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు ఉన్నాయని పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన 20 విమానాల్లో ఆరు ఇండిగో విమానాలు, ఆరు విస్తారా, ఆరు ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి.
విమానాలకు బెదిరింపుల విషయాన్నికేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ఆకతాయిలు ఈ పని చేస్తే జైళ్లలో పెట్టనున్నారు. పెద్దలు కుట్రపూరితంగా తప్పుడు కాల్స్ చేస్తే వారు జీవితంలో మర్చిపోని విధంగా షాక్ ఇవ్వనున్నారు.