Bengaluru encounter: డబ్బుల కోసం కిడ్నాప్ చేసి చంపేశారు - అక్కడే కాల్చి పడేసిన పోలీసులు - చివరిలో ఓ ట్విస్ట్!
Bengaluru: బెంగళూరులో 13 ఏళ్ల బాలుడ్ని ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. హత్య చేశారు. నిందితుల్నిపోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కానీ వాళ్లు చనిపోలేదు.

Kidnappers encounter: బెంగళూరులో 13 ఏళ్ల బాలుడు నిశ్చిత్ కిడ్నాప్ , హత్య కేసుకు సంబంధించి, బెంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని బన్నెర్‌ఘట్ట ప్రాంతంలో జరిగింది.
నిశ్చిత్ కుటుంబానికి డ్రైవర్‌గా పనిచేసిన శివప్రకాశ్ అనే వ్యక్తి .. తమ యజమాని కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకునే కుమారుడ్ని కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు దండుకోవచ్చని తన ఇద్దరు స్నేహితులకు చెప్పాడు. శివప్రకాష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా, గురుమూర్తి ,గోపీ అనే వ్యక్తులు నిశ్చిత్‌ను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. నిశ్చిత్‌ను కిడ్నాప్ చేసిన తర్వాత, నిందితులు బాధితుడి కుటుంబం నుంచి రూ. 5 లక్షల రాన్సమ్ డిమాండ్ చేశారు.
కిడ్నాప్ చేసిన తర్వాత, నిందితులు నిశ్చిత్‌ను కొట్టి, హత్య చేశారు. ఆ తర్వాత, ఆధారాలను దాచడానికి అతని శవాన్ని బన్నెర్ఘట్ట రోడ్డు సమీపంలోని ఒక ప్రాంతంలో దహనం చేశారు. శవం సగం కాలిపోయిన స్థితిలో 2025 జులై 31న బయటపడింది. బాధితుడి తల్లిదండ్రులు నిశ్చిత్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేయడానికి బన్నెర్ఘట్ట రోడ్డు ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు.
A 13yr Old student #Nischith,was #abducted near Arekere #Bengaluru while returning from tuition on Wednesday evening.His parents received a #ransom call demanding ₹5 lakh.#Police launched search operation,but the boy was found murdered near Kaggalipura Road on Thursday.. pic.twitter.com/7ritgew9k0
— Yasir Mushtaq (@path2shah) July 31, 2025
2025 జులై 31 రాత్రి, నిందితులు గురుమూర్తి , గోపీలు పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు ప్రతిస్పందనగా కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితుల కాళ్లలో గాయాలయ్యాయి. వారిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. నిందితులకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
A 13-yr-old boy was kidnapped on his way to tuition in Bengaluru. Hours later, his burnt body was found. Kidnappers demanded ₹5L ransom, then killed him fearing police tracking.
— Global Updates 🌍 (@GlobalUpdates7) August 1, 2025
2 accused arrested.#JusticeForTheChild #Bengaluru #CrimeNews #StopChildAbuse #IndiaNews pic.twitter.com/ov90IKbD4D
నిశ్చిత్ ను కిడ్నాప్ చేసి ఐదు లక్షలు డిమాండ్ చేయాలనుకున్నారు కానీ.. ముందే నిందితులు బాలుడిని హత్య చేసి, శవాన్ని దహనం చేశారు. బెంగళూరు సిటీ పోలీసులు ఈ కేసును 24 గంటలలోపు క్లోజ్ చేయగలిగారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ , స్థానికులు సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు.





















