Viral News: అతని జీతం 15వేలే, కానీ 24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు- షాక్ తిన్న అధికారులు
Viral News: కర్ణాటకకు చెందిన రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మాజీ క్లర్క్‌ఇంటిపై రైడ్ చేసిన అధికారులు షాక్ తిన్నారు. అతని పేరు ఉన్న ఆస్తులు చూసి బిత్తరపోయారు.

Bengaluru News: కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఇంట్లో లోకాయుక్త అధికారులు తనిఖీలు చేసి షాక్ తిన్నారు. అతని వద్ద 30 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు.
కొప్పల్‌లో పని చేసే కలకప్ప నిదగుండి అనే మాజీ ఉద్యోగి నెల జీతం పదిహేను వేల రూపాయలు. అలాంటి వ్యక్తికి 24 ఇళ్లు, నాలుగు ప్లాట్స్, నలభై ఎకరాలు వ్యవసాయం భూమి గుర్తించారు. అంతేనా అతని వద్ద నుంచి నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆస్తులు అన్నీ కూడా అతని పేరు మీద , భార్య, సోదరుడి పేరు మీదే ఉన్నాయి. KRIDLకి చెందిన మాజీ ఇంజనీర్ ZM చిన్చోల్కర్‌తో కలిసి పూర్తి కానీ 96 ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి రూ. 72 కోట్లకుపైగా తీనేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులోనే ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది.
అవినీతికి పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో సోదాలు చేశారు. హసన్, చిక్‌బల్లాపూర్, చిత్రదుర్గ్, బెంగళూరులో తనిఖీలు చేపట్టారు.
ఈ కేసులో హాసన్‌లోని ఎన్‌హెచ్‌ఏఐ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయన్న ఆర్; చిక్‌బల్లాపూర్ గ్రామీణ తాగునీటి అండ్ శానిటైజేషన్ విభాగం జూనియర్ ఇంజినీర్ అంజనేయ మూర్తి, హిరియూర్, చిత్రదుర్గ్‌లోని తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటేష్, బెంగళూరులోని శెట్టిహళ్లిలోని బీబీఎంపీ దారసహళ్లి సబ్‌డివిజన్ రెవెన్యూ అధికారి వెంకటేష్, బెంగళూరులోని బీడీఏ ప్రధాన కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ హార్టికల్చర్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లందపై లోకాయుక్త నిఘా కొనసాగుతోంది. ఇందులో కర్ణాటక రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీలో స్పెషల్ డిప్యూటీ కమిషనర్‌్గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి వసంతి అమర్ బీవీ కూడా ఉన్నారు. బీఎఎస్‌ఆర్‌పీ కోసం భూసేకరణ విషయంలో అక్రమార్కులు పాల్పడినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 41 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టి 38 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. వంసతికి చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తే 9 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇప్పుడు మాజీ క్లర్క్ ఇంటిలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు.





















