అన్వేషించండి

Kerala: పుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన పెద్దాయన - గుణపాఠం చెప్పిన బామ్మ - వీడియో వైరల్

Kozhikode:కేరళలోని కోజికోడ్ లో సామాన్య బామ్మ చూపిన అసామాన్య ధైర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫుట్‌పాత్‌పైకి బైక్‌పై దూసుకొచ్చిన వ్యక్తికి బుద్ది చెప్పింది.

Kozhikode elderly woman Courage: రోడ్ల మీద ఎవరూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించరు. చాలా మంది పుట్ పాత్ మీద బైకులతో వచ్చేస్తారు. వీరిని ఎవరూ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేరు. కానీ కొంత మంది ఉంటారు.. వారికి భయం ఉండదు. వారిలో ఈ బామ్మ ముందుంటారు. 
 
కోజికోడ్ నగరంలోని ఎరన్హిపాలం జంక్షన్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ తప్పించుకోవడానికి తన స్కూటర్‌ను  ఫుట్‌పాత్‌పైకి ఎక్కించాడు. చాలామంది భయంతో పక్కకు తప్పుకుంటున్నా,  73 ఏళ్ల ప్రభావతి  అనే మహిళ మాత్రం వెనక్కి తగ్గలేదు. వాహనదారుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినా, ఆమె అడ్డుగా నిలబడి ఫుట్‌పాత్ నడిచేవారికే కానీ బండ్ల కోసం కాదని గట్టిగా నిలదీశారు.

ఆమె పట్టుదలను చూసి సదరు వాహనదారుడు వాదనకు దిగినప్పటికీ, బామ్మ తన మొబైల్ ఫోన్ తీసి బండి నంబర్‌ను ఫోటో తీయడం ప్రారంభించారు. ఆ ధైర్యానికి, సామాజిక స్పృహకు కంగుతిన్న ఆ వ్యక్తి, చివరికి తన తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి ప్రధాన రహదారిపైకి వెళ్లక తప్పలేదు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అది కాస్తా వైరల్ అయ్యి  నిజమైన హీరో అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సాధారణంగా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు గొడవ ఎందుకని పక్కకు తప్పుకుంటాం కానీ, నిబంధనలను ఉల్లంఘించే వారికి అక్కడికక్కడే బుద్ధి చెప్పడం ద్వారా ఆమె ఒక సామాజిక బాధ్యతను ప్రదర్శించారు. ప్రభుత్వం కూడా ఆమె సాహసాన్ని గుర్తించి, కేరళ మోటార్ వాహనాల శాఖ ఆమెను ప్రత్యేకంగా సన్మానించింది.  

 వ్యవస్థ మారాలని కోరుకోవడం కంటే, మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ధైర్యం మనలో ఉండాలని ఆమె నిరూపించారు. చదువు అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు, తోటివారి హక్కులను గౌరవించడం ,  సామాజిక క్రమశిక్షణను పాటించడం కూడా అని ఆమె చేతల్లో చూపారు.  తెలంగాణ హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్ కూడా ఆమె నుంచి చాలా నేర్చుకోావాల్సి ఉందని ప్రశంసించారు. 

ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాదు, మన ప్రాణాల రక్షణ కోసమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పోలీసులు ప్రతి అడుగులోనూ ఉండలేకపోవచ్చు, కానీ బాధ్యత గల పౌరులే అడుగడుగునా నిఘా నేత్రాలైతే ఇలాంటి ఉల్లంఘనలకు తావుండదని నెటిజన్లు అంటున్నారు.    

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ABP Desam Top 10, 10 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 10 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget